గుండె ఆరోగ్యానికి ఏ వంట నూనె మంచిదంటే…………….

October 27, 2016

వంటనూనెలలో ఏ నూనె ఆరోగ్యానికి మంచిదనే విషయం పట్ల చాలామందిలో గందరగోళం నెలకొని ఉంది.

అన్ని నూనెలూ ఆరోగ్యానికి హాని చేస్తాయి.. కొవ్వు పెంచేస్తాయి.. వంటి అధిక అభిప్రాయాలు చాలామందిలో పేరుకుపోయాయి. నిజానికి ఇది పూర్తిగా వాస్తవం కాదు . నూనెల నుంచి లభించే అన్ని రకాల కొవ్వుపదార్థాలు అనారోగ్యం కలిగించవు. వాటిల్లో ఉపయోగపడేవీ ఉంటాయి. ఆ వివరాలు తెలుసుకుని, పరిమితంగా వాడితే ఆరోగ్యానికి మంచిది.

ground-nut-oil

శరీర పనితీరు బాగుండాలంటే విటమిన్లు, ఖనిజాలు ఎలా తప్పనిసరో కొవ్వుల వాడకం కూడా అంతే ప్రధానం. ముఖ్యంగా ఎ, డి, ఇ, కె వంటి కీలక విటమిన్లు శరీరానికి నేరుగా అందాలంటే కొవ్వులని ఆహారంలో తప్పక తీసుకోవాలి.

ఇవి మనం తినే పప్పుల నుంచీ, తృణధాన్యాల నుంచీ కొంతవరకు అందితే.. మరికొంత వంటల్లో వాడే నూనెల నుంచి అందుతాయి. ఇంకొంత శాతం శరీరమే స్వయంగా విడుదల చేస్తుంది.కొవ్వుల నుంచి ప్రధానంగా విటమిన్‌ ఎ, డి, ఇ, కె వంటి విటమిన్లు లభిస్తాయి.

వీటితో పాటు వాటికుండే రంగు, రుచి, వాసన, ఇతర పోషకాల కారణంగా నూనెలు ప్రత్యేకతలను సంతరించుకొంటాయి. ముఖ్యంగా వాటిలోని ఫ్యాటీ యాసిడ్ల మేళవింపు, మోతాదు కారణంగానే నూనెలు ఎంత వరకు ఆరోగ్యప్రదం అన్న విషయం తెలుస్తుంది.

ఈ ఫ్యాటీ యాసిడ్లు మూడు రకాలుంటాయి. ఒకటి శాచురేటెడ్‌ అయితే తక్కినవి అన్‌శాచురేటెడ్‌ రకాలు. అన్‌శాచురేటెడ్ లో మోనో అన్‌శాచురేటెడ్‌ , పాలీ అన్‌శాచురేటెడ్‌ ఉంటాయి.

శాచురేటెడ్‌ కొవ్వులు సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద ఘన రూపంలో ఉంటాయి. వాస్తవానికి శరీరం ఎప్పటికప్పుడు కావాల్సినంత శాచురేటెడ్‌ కొవ్వులని ఉత్పత్తి చేసుకొంటుంది. అయినా శాచురేటెడ్‌ కొవ్వులని బయట నుంచి అదనంగా వాడటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగని పూర్తిగా దూరంగా ఉండటం కూడా మంచిది కాదు. ఎందుకంటే శరీర పనితీరుకు ఈ కొవ్వులు తప్పనిసరిగా అవసరం అవుతాయి.

ఇక మోనో అన్‌శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులని కలిపి అన్‌శాచురేటెడ్‌ కొవ్వులుగా వ్యవహరిస్తారు. మోనో అన్‌శాచురేటెడ్‌ అంటే, ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటాయి. రిఫ్రిజిరేటర్‌లో పెట్టగానే ఘనరూపంలోకి వస్తాయి. ఆరోగ్యపరంగా కూరలు, వేపుళ్లలో ఉపయోగించడానికి మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు చక్కగా ఉపయోగపడతాయి. వేరుసెనగ, నువ్వులు, కనోలా, ఆలివ్‌ నూనెలు ఈ కోవకు చెందుతాయి. ఆలివ్‌ నూనె తప్ప తక్కినవి అధిక ఉష్ణోగ్రతలకుగురిచేసినా కూడా వీటిల్లో పెద్దగా మార్పు ఉండకపోవడం విశేషం.

పాలీ అన్‌శాచురేటెడ్‌ అధికంగా ఉండే నూనెలు శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తంలోని చక్కెర స్థాయులని నియంత్రిస్తాయి. రెండవ రకం మధుమేహం సమస్యని నియంత్రిస్తాయి. గుండెజబ్బులు, రొమ్ముకాన్సర్స్ రాకుండా అడ్డుకొంటాయి. సోయాబీన్‌ నూనె, సన్‌ఫ్లవర్‌ నూనెల్లో ఈ పాలీ అన్‌శాచురేటెడ్‌ అధికంగా లభ్యమవుతుంది.

అంటే గుండె ఆరోగ్యానికి వేరుసేనక్కాయ నూనె కంటే సన్ ప్లవర్ నూనె ఎంతో మంచిది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...