కాకరకాయలతో ఎన్ని జబ్బులు నయమవుతాయంటే………….

September 25, 2016

చేదుగా ఉందని కాకరకాయలను దూరంగా పెట్టకండి.
ఆ చేదుగా ఉండే కాకరకాయే మనల్ని ఎన్నో రోగాల నుండి రక్షిస్తుంది.

kakarakaya

అవేమిటంటే…….

* కీళ్ళనొప్పులు తగ్గించే గుణం కాకరకుంది.కాకర వంటకాలు తిని ఆ లాభం పొందగలరు.
కాకరరసాన్ని బాధిస్తున్న కీలుమీద రాసి నెమ్మదిగా మర్దన చేయాలి.

* కాలేయం ఆరోగ్యానికి కాకర ఎంతగానో ఉపకరిస్తుంది.
కాలేయం చెడిపోకుండా లేదా దాని సామర్థ్యం తగ్గకుండా కాపాడే శక్తి కాకరకు వుంది.

* షుగర్‌ వ్యాది గలవారు రెండు మూడు నెలలపాటు వరుసగా కాకరరసం తీసుకోవాలి.
కాకరను ఆహారంగా తీసుకున్నా, షుగర్‌ స్థాయి మారుతుంది.

* కడుపులో పరాన్నజీవులు చేరటంవల్ల పలురకాల ఇబ్బందులు, అనారోగ్యాలు వస్తాయి.
ఆ అనారోగ్యకారక పరాన్నజీవులను కాకర పసరు తొలగిస్తుంది.
రోజుకు ఒక స్పూన్‌ రసం తీసుకుంటే చాలు.

* మలబద్దకాన్ని వదిలించుకునేందుకు రోజుకు రెండు సార్లు అరస్పూన్‌ చొప్పున తీసుకుంటే చాలు.

* తాజాగా తీసిన కాకర పసరును, నీళ్ళతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే కామెర్ల వ్యాధి
తగ్గుతుంది. కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా వుంటాయి.
అటువంటి పచ్చదనం కళ్ళలో మాయమవగానే దీనిని తీసుకోవటం మానివేయాలి.

* కాకరకాయలను గర్బిణీలు తినకూడదు.కాకర చేదు ఆ సమయంలో మంచిది కాదు.

* పండిన కాకరకాయను ఎవరూ తినకపోవడమే ఎంతో మంచిది .

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...