ఈ మూడింటినీ కలిపి , ఇలా తీసుకుంటే ………. అన్ని జబ్బులూ దూరం

November 24, 2016

మనందరికీ తెలిసిన మెంతులు , వాము , నల్ల జీలకర్రను ఉపయోగించి అన్ని వ్యాధులనూ
దూరం చేసుకోవచ్చు. ఎలాగంటే ………

250 గ్రాముల మెంతులు .
100 గ్రాముల వాము .
50 గ్రాముల నల్ల జీలకర్ర .

mentulu

*తయారు చేయు విధానము*
*********************
ముందుగా పై మూడు పదార్దాలను శుభ్రం చెయ్యండి .

వేరు వేరుగా పెన్నం పైన వేసి కొద్దిగా వేడి చేయండి.

తర్వాత మెంతులు + వాము + నల్ల జీలకర్రలని కలిపి పొడిగా తయారు చేయండి .

గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకొండి .

*వాడే విధానము* : —

ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత

1 గ్లాసు *వేడి నీళ్ళలో* 1 స్పూను *చూర్ణం* ( పొడి ) ని కలిపి త్రాగవలెను .

వేడి నీళ్ళ* లో మాత్రమే త్రాగ వలెను .

ఈ చూర్ణం త్రాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకొనరాదు .

అన్ని వయసుల వారు స్త్రీలు , పురుషులు , వృద్దులు ఈ చూర్ణంని సేవించ వచ్చును .

ప్రతి రోజు ఈ చూర్ణంని సేవించడము వలన శరీరంలో పేరుకున్న *విష పదార్ధాలు* మల , మూత్ర , చెమటల ద్వార బయటకు నెట్టి వేయ బడును .

80 – 90 రోజులు తీసుకున్న తర్వాత మీకు ఉత్తమ ఫలితాలు రావాడాన్ని మీరు గమనించ గలరు .

అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగి పోతుంది .

రక్తం శుభ్రపడుతుంది . మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది .

శరీరంలో వున్న ముడతలు తగ్గుతాయి .

శరీరం బలంగా , చురుకుగా మరియు ప్రకాశ వంతముగా వుండును .

*ప్రయోజనాలు . ( Benefits )*
****************************
1. కీళ్ళు మరియు మోకాళ్ళ నొప్పులన్నియు తగ్గి పోవును .
2 . ఎముకలు బలంగా తయారవుతాయి .
3. కంటి చూపు మెరుగవుతుంది .
4 . జుట్టు పెరుగుదలని మెరుగు పరుస్తుంది .
5 . మల బద్దకం శాశ్వతంగా నివారించ బడును .
6 . రక్త ప్రసరణని మెరుగు పరుస్తుంది .
7 . దీర్ఘ కాలిక దగ్గు నివారించ బడును .
8 . గుండె యొక్క పనితీరు మెరుగవుతుంది .
9 . మీరు చలాకిగా వుంటారు .
10 . జ్ఞాపక శక్తి పెరుగుతుంది .
11 . వినికిడి శక్తి పెరుగుతుంది .
12 . గతంలో తీసుకున్న అల్లోపతిక్ మందుల దుష్పృభావలను ( Side Effects ) క్లియర్ చేస్తుంది .
13 . రక్త శుద్ది జరుగుతుంది .
14 . అన్ని రక్తనాళాలు శుద్ధి అవుతాయి .
15 . పళ్ళు చిగుళ్ళు బలముగా తయారవుతాయి .
16 . మధు మేహ వ్యాధిని నియంత్రిస్తుంది .
17 . 2 లేక 3 నెలల తరువాత ఈ ఫలితాలను గుర్తించ గలరు .

*గమనిక* :–

నిరాటంకంగా 3 నెలలు ఈ చూర్ణం తీసుకుంటే 15 -20 రోజులు ఆపి ,
ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు .

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...