ఈ ఆకును వీటితో కలిపి తింటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బరువు పెరగొచ్చు , తగ్గొచ్చు

October 14, 2016

ఎప్పుడు కావాలంటే అప్పుడు బరువు పెరగాలనుకుంటున్నారా…..? లేదా
బరువు తగ్గాలనుకుంటున్నారా….? అయితే పొన్నగంటి కూరతో అది సాధ్యమని తెలుసుకోండి.

ponnaganti-koora

పొన్నగంటి కూర ఆరోగ్యపరంగా ఎంత ఉపయోగకరమంటే……..

మనం తీసుకునే ఆహారంలో, పీల్చుకునే గాలిలో అనేక రసాయనాలు ఉండటంతో
అవి రక్తంతో కలిసిపోతున్నాయి. దాని ఫలితంగా రక్తం కలుషితమైపోతోంది.
ఈ కలుషిత రక్తం ఎన్నో రోగాలకు దారి తీస్తుంది.
అలాంటి రక్తాన్ని శుద్ధి చేయడానికి మనకు ఎంతో ఉపకరిస్తుంది పొన్నగంటి కూర.

అంతే కాదు, పొన్నగంటి కూర వల్ల బరువు తగ్గడం, పెరగడం వంటి ఎన్నో ఉపయోగాలూ ఉన్నాయి.

అవేంటంటే..

రక్తాన్ని శుద్ధి చేసేందుకు…..

శుభ్రం చేసిన పొన్నగంటి ఆకును కట్‌ చేసి..
దానిలోకి పెసరపప్పు, చిన్న ఉల్లి పాయలు, జీలకర్ర, వెల్లుల్లి,
మిరియాల పొడి చేర్చి ఉడికించి తీసుకుంటే సరిపోతుంది.

అలాగే బరువు తగ్గాలనుకునే వారు……….

పొన్నగంటి కూరను ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే
బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అదే బరువు పెరగాలనుకునే వారు………

కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు.

శరీరానికి మేలు చేయడంతో పాటు పొన్నగంటి కూరను తీసుకోవడం ద్వారా
శరీర ఛాయను మెరుగుపరుచుకోవచ్చు.

ఎక్కువ ఎండల్లో తిరిగి పనిచేసే వారికి, గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి
కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.

అలాంటి వారికి.. పొన్నగంటి ఆకుతో తాలింపు చేసుకుని తీసుకుంటే ఫలితం ఉంటుంది.

ఇంకా, ఈ ఆకుకూర నోటి దుర్వాసనను పోగొడుతుంది.

అలాగే గుండెకు, మెదడుకు ఉత్సాహాన్నిస్తుంది.

మరి, ఇన్ని ప్రయోజనాలున్న పొన్నగంటి కూరను వాడటం ఇప్పుడే మొదలుపెట్టండి!

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...