ఇలాంటి సందర్భాలలో తేనెను వాడితే ….. అది ఎంతో ప్రమాదకరం

November 26, 2016

తేనె ఆరోగ్య పరంగా మంచిదనే విషయం మనలో చాలా మందికి తెలుసు. కానీ కొన్ని సందర్భాలలోనూ , కొన్ని రకాల వ్యాధిగ్రస్తులూ మరియు కొన్నింటిని కలిపి తేనెను వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

అవేమిటంటే ……….

మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు.
ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి.

choney

తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు.

అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు.

తేనెను మరిగించకూడదు.

తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు.

తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి.
(తేనెలో రకరకాల పువ్వుల మకరందాల అంశ ఉంటుంది. వీటిల్లో విష పుష్పాలు సైతం ఉంటాయి)

మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలపకూడదు.

తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు.

తేనెను ఫ్రిజ్లో ఉంచకూడదు. ఫ్రిజ్లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి.
అలాంటి సందర్భాల్లో ఎండలో ఉంచితే సరిపోతుంది. లేదా తేనె సీసాను వేడి నీళ్లలో పెట్టి
పరోక్షంగా వేడిచేస్తే తేనె స్పటికాలు కరిగి తిరిగి తేనె తయారవుతుంది.

తేనెను, నెయ్యిని సమాన భాగాలుగా తీసుకోకూడదు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...