ఆధార్ కార్డు ఉంటే చాలు ….. డబ్బులు అక్కరలేదు …… ఆపరేషన్ చేసేస్తారు

November 16, 2016

ఒక వైద్యుడి ఔదార్యం ఇది.

సాటి మనుషుల పట్ల మానవత్వంతో స్పందించిన తీరు ఇది.

gop

‘‘కేవలం ఆధార్‌ కార్డుతో రండి. డబ్బులు ఇవ్వకపోయినా ఆపరేషన్‌ చేస్తాం’’ అంటూ…..
గుంటూరుకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ప్రకటించారు.

పాతనోట్ల రద్దు, కొత్త కరెన్సీ చేతిలో లేకపోవడం,
పాత నోట్లు చెల్లకపోవడంతో పలువురు రోగులు వైద్యం అందక నిరాశతో వెనుదిరుగుతున్నారు.

ఈ నేపథ్యంలో గుంటూరు అరండల్‌పేటలోని సాయిభాస్కర్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌
ఎండీ డాక్టర్‌ నరేంద్రరెడ్డి మాత్రం సహృదయంతో……..
అందుబాటులో డబ్బు లేకపోయినా శస్త్రచికిత్స చేస్తానంటూ ముందుకొచ్చారు.

వచ్చే ఏడాది మార్చి తర్వాత కొత్త నగదు చెల్లించవ్చని తెలిపారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...