ఆధార్ కార్డు ఉంటేనే రైలు టికెట్

November 18, 2016

మీరు రైళ్ళలో ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారా…….?
అయితే ఈ విషయాన్ని తెలుసుకొని, మీ శ్రేయోభిలాషులందరికీ తెలియజేయండి.

train

అసలు విషయంలోకి వెళితే……

రైళ్ళలో ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రెల్వే శాఖ చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా రైలు టికెట్టు కొనుగోలును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు
కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

రైలు టికెట్లను ఆధార్‌తో అనుసంధానం చేయాలని రైల్వే శాఖ ఎప్పటి నుంచో భావిస్తున్నది.
పదిహేను రోజుల్లో దీనిపై ఒక విధాన నిర్ణయం వెలువడే అవకాశాలున్నట్లు తెలిసింది.

ఇది అమల్లోకి వస్తే రైలు ప్రయాణం కోసం టికెట్‌ కొనాలంటే,
తప్పనిసరిగా ఆధార్‌ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఇది రిజర్వ్‌డ్‌ టికెట్లకే కాకుండా, అన్‌ రిజర్వ్ డ్ కేటగిరీకి కూడా వర్తిస్తుంది

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...