అయ్యోపాపం ….. 10 నెలల చిన్నారిని ఆ ఆయా కాలితో తన్ని , ఎంత దారుణంగా చేసిందంటే….

November 25, 2016

పది నెలల చిన్నారిపై ఒక ఆయా చేసిన దారుణం ఇప్పుడు అందరి మనసులనూ కలచివేస్తోంది.
ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చినా ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారుల‌పై దాడులు మాత్రం ఆగ‌డం లేదు.

త‌ల్లిదండ్రులు ఉద్యోగ రీత్య త‌మ చిన్నారుల‌ను కేర్ టేకర్స్‌కు అప్ప‌గించి వెళుతున్నారు.
కానీ అక్క‌డ ప‌నిచేసే ఆయాలు మాత్రం వీరిప‌ట్ల చాలా దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

mukku

కొన్ని నెల‌ల క్రితం క‌రీంన‌గ‌ర్‌లో ఓ చిన్నారి ప‌ట్ల క్రూరంగా వ్య‌వ‌హ‌రించిన ఆయా ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే,
న‌వీ ముంబ‌యిలో మ‌రో ఆయా రెచ్చిపోయింది. పూర్వ ప్లే స్కూల్లో పనిచేసే ఆయా
10 నెల‌ల బాలుడిని చిత‌క బాదింది. నేల‌కేసి కొట్టింది.

ఆ చిన్నారి తనకేదో హానితలపెట్టినట్లుగా కసిగా కాలుతో కొట్టింది ఆయా.
పాపం ఆ చిన్నారి బాధ‌ను అర్థం చేసుకునే వారే లేక‌పోయారు.

ఆయా ఆ చిన్నారిపై దాడి చేస్తున్న దృశ్యాలు అక్క‌డే ఉన్న సీసీ కెమరా కంటికి చిక్కాయి.

న‌వంబ‌ర్ 21న ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ప్ర‌స్తుతం ఆ చిన్నారి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయాపై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు ఆయాను 14 రోజుల రిమాండ్ కు తరలించారు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...