స్ట్రెచర్ ఇవ్వని ఆసుపత్రి సిబ్బంది – ఏడుస్తూ భర్తను ఈడ్చుకెళ్ళిన భార్య

November 17, 2016

అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు , సిబ్బంది మానవత్వాన్ని మంటగలిపారు.
తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్తను మొదటి అంతస్తులోని వైద్యుని వద్దకు తీసుకెళ్లేందుకు
స్ట్రెచర్ ఇవ్వాలని సిబ్బందిని భార్య ప్రాధేయపడితే కనీసం పట్టించుకోలేదు.
దీంతో విధిలేని రోగి భార్య ఆయన్ను ర్యాంపు పైనే ఈడ్చుకెళ్ళాల్సి వచ్చింది.

mm1

వివరాల్లోకి వెళితే……..

గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్ మదీనా మసీదు ప్రాంతానికి చెందిన శ్రీనివాసాచారి హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. అనారోగ్యం వల్ల కొంతకాలం క్రితం ఇంటికి తిరిగి వచ్చేసాడు.

మూడు రోజులుగా కడుపు నొప్పి , విరేచనాలతో బాధపడుతున్న ఆచారిని బుధవారం ఉదయం
ఆయన భార్య శ్రీవాణి పెద్దాసుపత్రికి తీసుకొచ్చింది.

కాలికి గాయం , ఆపై నీరసంగా ఉన్న భర్తను ఆసుపత్రిలోకి తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ ఇవ్వాలని సిబ్బందిని , సెక్యూరిటీ గార్డులను ప్రాధేయపడింది.

ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కతే గరుకుగా , ఎత్తుగా ఉండే ర్యాంపుపైనే
భర్తను లాక్కొని వెళ్ళి సర్జికల్ వార్డులో చేర్చింది.

డాక్టర్లు , నర్సులు , ఆసుపత్రిలోని ఇతర సిబ్బందితో సహా అక్కడ ఉన్న కొంత మంది మనుషులు
ఎవరూ కూడా అయ్యోపాపం అని కనికరించలేదు.

ఒంటరిగా భర్తను లాక్కెళుతున్న మహిళ పట్ల కనీస జాలి కూడా చూపించలేదు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...