సెల్ రేడియేషన్ నుండి కాపాడుకోవడం ఎలాగంటే…………..

September 22, 2016

సెల్ రేడియేషన్ నుండి మనల్ని మనం కాపాడుకోవడం ఎలాగంటే…………
—————————————————
ప్రపoచ ఆరోగ్య సoస్థ సెల్ పోన్ల వల్ల క్యాన్సర్ ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఇటీవలే ప్రకటించిన విషయం తెలుసే కదా! అయితే సెల్ రేడియేషన్ను ఎలా నివారించాలో తెలుసుకుంటే ఈ ప్రమాదం నుంచి మనం విముక్తి పొందవచ్చు.

mobile-radiation

హెడ్ సెట్:
***********
హెడ్సెట్స్ ఫోన్ల కంటే తక్కువ రేడియేషన్ను విడుదల చేస్తాయి. అందుకే హెడ్సెట్లు కాస్త మేలు చేస్తాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాకపోతే రెండు హెడ్సెట్లు కాకుండా సింగిల్ హెడ్సెట్ ఉపయెగించి రేడియేషన్ను తగ్గించుకోవచ్చు.

ఎక్కువ వినడమే: ఫోన్ మాట్లాడినప్పుడే రేడియేషన్ ప్రసరిస్తుంది. మెసేజింగ్ చేసినప్పుడు రేడియేషన్ ప్రభావం పెద్దగా ఉండదు. కాబట్టి మొబైల్ వాడకంలో ముఖ్యంగా ఎక్కువ విని.. తక్కువ మాట్లాడటం చేస్తే రేడియేషన్ తీవ్రత తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

టెక్స్ సెండింగ్: ఫోన్లలో వాయిస్ కు బదులుగా టెక్స్ పంపడానికి ప్రాధాన్యమివ్వాలి. ఎందుకంటే టెక్స్ మెసేజ్ కు మొబైల్ టాకింగ్ కంటే రేడియేషన్ చాలా తక్కువ. రేడియోధార్మికతను తలకు దూరంగా ఉంచడంలో టెక్స్ మెసేజింగ్ తోడ్పడుతుంది.

* వీక్ సిగ్నల్:

తక్కువ సిగ్నల్ బార్స్ తన వికిరణాలను ఎక్కువగా విడుదల చేస్తుంది. కాబట్టి సిగ్నల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ వాడితే చాలా మంచిది.

* రేడియేషన్ షీల్డ్స్:

యాంటెనా టోపీలు లేదా కీప్యాడ్ వంటి రేడియేషన్ షీల్డ్స్ మొబైల్ ద్వారా కలిగే చెడు ప్రభావాలను దాదాపు కంట్రోల్లో ఉంచుతాయి.

* జేబులో వద్దు:

పురుషులు అస్తమానం మొబైల్ ను జేబులో పెట్టుకోవడం వల్ల వీర్యకణాభివృద్ధి సమస్యలు వస్తాయి. టెస్టోస్టీరాన్ స్థాయి తగ్గుతుంది. కాబట్టి సాంతానోత్పత్తికి ఆటంకంగా మారకుండా ఉండాలంటే మొబైల్ను జేబులో పెట్టుకోవడం మానుకోవాలి.

* బ్లూటూత్ వద్దు:

అన్ని సమయాల్లో బ్లూటూత్ ను ధరించడం వల్ల కూడా రేడియేషన్ సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. బ్లూటూత్ చూడటానికి బాగుగా అనిపించినా దానివల్ల కూడా నష్టాలున్నాయని అంటున్నారు. కాబట్టి బ్లూటూత్ ను కూడా పరిమితoగా వాడితేనే మoచిది.

2 Comments

on సెల్ రేడియేషన్ నుండి కాపాడుకోవడం ఎలాగంటే…………...
  1. sayyad basha
    |

    God is Allah

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...