సూపర్ స్టార్ రజనీ కాంత్ గారి జీవితంలో జరిగిన అద్భుత సంఘటన

September 30, 2016

సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఒక భిక్షగాడిగా భావించి,
ఆయనకు పది రూపాయలు భిక్ష వేసిన ఒక మహిళకు సంబంధించిన
ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

rajanikanth

ప్రముఖ వైద్యురాలు గాయత్రీ శ్రీకాంత్ గారు రజనీ కాంత్ పై రాసిన పుస్తకంలో ఈ విషయం వెలుగు చూసింది.

రజనీ కాంత్ హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత
బెంగుళూరులోని ఒక ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించడానికి వెళ్లారట ,
దర్శనం తర్వాత ఆయన ఆ గుడిలోని ఒక స్థంబం వద్ద కూర్చున్నారట.

రజనీ తన సాధారణ గెటప్ లో పంచె , చెరిగిన జుట్టు , మాసిన గెడ్డంతో అక్కడ కూర్చున్నారు.

అక్కడ రజనీని చూసిన ఒక గుజరాతీ మహిళ ,
ఆయనను భిక్షగాడు అనుకొని రజనీ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు దానం చేసింది.

ఈ సంఘటనకు రజనీ ఏమీ మాట్లాడకుండా ఆమెను చూసి చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారట.

అది చూసిన కొంతమంది పరిగెత్తుకొని వచ్చి,
“ ఆయనను ఎవరనుకుంటాన్నావ్……..? అంటూ ఆ గుజరాతీ మహిళను తిట్టడం మొదలుపెట్టారట.

దానితో బెదిరిపోయిన ఆ గుజరాతీ మహిళ , రజనీని పట్టుకొని క్షమించమని ఏడ్చిందట.

దానికి రజనీ ఆమెను ఓదారుస్తూ,
ఇది దేవుడు తనకు ప్రసాదించిన అసలు రూపమని చెబుతూ ,
తాను సూపర్ స్టార్ ను కాను ,
కేవలం సామాన్యుడినే అని ఆ దేవుడు ఆమె చేత చెప్పించాడని ఆమెను ఓదార్చి ,
ఆమె ఇచ్చిన 10 రూపాయలకు తోడుగా మరో 10 లక్షల రూపాయలను కలిపి
ఒక అనాథ శరణాలయానికి ఇచ్చాడట మన సూపర్ స్టార్.

హ్యాట్సాఫ్ టు రజనీ కాంత్ సర్.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...