సరిగా విశ్రాంతి తీసుకోకుంటే గుండెపోటు వస్తుందా……..?

September 15, 2016

అకస్మాత్తుగా ప్రాణాలను గాలిలో కలిపే గుండెపోటుకు ,
నిద్ర పోకపోవడానికి ఉన్న సంబంధమేమిటి ?
విశ్రాంతి తీసుకోకుంటే గుండెకు అంతటి ప్రమాదం జరుగుతుందా …………?
ఇటీవల జరిగిన వైద్య పరిశోధనలన్నీ ఖచ్చితంగా అవుననే చెబుతున్నాయి.

000ac-copy-27-copy-copy

వేలాది మంది స్త్రీలపై పరిశోధనల ప్రకారం …………..
ఎవరైతే 7 గంటల కంటే తక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటారో, మిగిలిన వారితో పోలిస్తే తక్కువ సమయం విశ్రాంతి తీసుకునే స్త్రీలు ఎక్కువ గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.

తక్కువగా నిద్రపోవటం వలన హార్మోన్’ల వత్తిడి, రక్త పీడనంలో పెరుగుదల మరియు రక్తంలోని చక్కెర స్థాయిలలో మార్పులు వంటివి కలుగుతాయి. కావున రోజులో 9 గంటల పాటు పడుకోవటం మంచిది అని పరిశోధనలలో వెల్లడించారు. ఇదే పరిశోధనలలో స్త్రీలు రోజులో 9 గంటల సమయం పడుకోవటం వలన గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారు అని తెలిపారు.

గుండె సంబంధిత వ్యాధులు కలిగినపుడు చాలా అరుదుగా భౌతిక మార్పులు కలుగుతాయి. గుండె సంబంధిత వ్యాధుల వలన రక్త ప్రసరణలో మార్పులు కలిగినందు వలన చేతి గోళ్ళ, కాలి గోళ్ళలో మరియు శరీరం పైన ఉండే జుట్టులో అసాధారణ మార్పులు కలుగుతాయి.

అధిక బీపీ వలన కరోనరీ ధమనుల వ్యాధి అధికం అయ్యే అవకాశం ఉంది. ఇది ఎలాంటి లక్షణాలను బహిర్గత పరచదు మరియు ఇది నేరుగా ఉండే ఆరోగ్యాన్ని ప్రమాదానికి గురి చేస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాలను మరియు మెదడు వంటి ముఖ్యమైన భాగాలను కూడా ప్రమాదానికి గురి చేస్తుంది.

మరికొన్ని పరిశోధనల్లో……………
ఎవరైతే రోజులో 8 గంటల పాటూ విశ్రాంతి తీసుకోరో……….. వారు కూడా గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది అని పరిశోధనలలో వెల్లడైంది. అంతేకాకుండా స్త్రీలలో ఎవరైతే రోజులో 5 గంటలలేదా అంతకన్నా తక్కువ విశ్రాంతి తీసుకుంటారో వారిలో 39 శాతం గుండెపోటు అధికమయ్యే అవకాశం ఉంది అని ఇతర పరిశోధనలలో వెల్లడైంది.

జాగ్రత్త పడండి……………..
షుగర్ వ్యాధి కలిగిఉన్న వారు, వయసు మీరిన స్త్రీ లేదా పురుషులలో గుండెపోటుకి గురవటానికి ముందుగా సహజంగా చాతిలో నొప్పిగా భావిస్తుంటారు. మరియు శ్వాసలో తగ్గుదల, వీపులో నొప్పి మరియు దవడ లేదా భుజం నొప్పులతో భాదపడుతుంటారు.

డాక్టర్లు ఉదయపు సమయాన్ని ‘విట్చింగ్ అవర్’ అంటారు. కారణం ఏమిటంటే ……… చాల మంది ఉదయాన గుండె పోటుకు గురవుతుంటారు. కావున ఉదయపు సమయాన్ని విట్చింగ్ అవర్ అంటారు. ఉదయపు సమయాన ఒత్తిడి హార్మోన్స్, అనగా కార్టిసాల్ వంటి హార్మోన్ స్థాయిలు అధికం అవుతాయి. అంతేకాకుండా, వ్యక్తి డీహడ్రేషన్’కి గురవటం వలన రక్తం చిక్కగా మారి, సరఫరా చేయటానికి ఇబ్బంది అవుతుంది.

రక్త సంబంధీకులకు ఎవరికైనా 60 సంవత్సరాల కంటే ముందుగానే గుండె సంబంధిత వ్యాధులను కలిగి ఉంటారో, అలాంటివారిలో 10 శాతం వరకు గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...