సపోటా పండు తింటే ……… పది జబ్బులు మాయం

October 29, 2016

ఎంతో తియ్యగా ఉండే సపోటా పండు రుచికి రుచి గానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో కీలకమైనది.

సపోటా పండును తినడం వల్ల దాదాపుగా పది రకాల జబ్బులను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

గ్లూకోజ్‌ ఎక్కువగా ఉండే సపోటాలు అతి సులువుగా జీర్ణమవుతుంది.
ఇవి శరీరానికి తొందరగా శక్తినందిస్తాయి.

sapota

సపోటాలో విటమిన్‌-ఎ అధికపాళ్లలో ఉంటుంది. ఇది కళ్లకు ఎంతో మంచిది.
మధ్య వయస్కులు తరచూ సపోట పళ్లు తినడం వల్ల కంటి రుగ్మతలకు గురికాకుండా ఉండవచ్చు.

సపోటాలో కాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌లు ఎక్కువ మోతాదులో ఉంటాయి.
ఎముకల గట్టిదనానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

సపోటాలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇది ఇన్‌ఫెక్షన్స్‌ నుంచి కాపాడుతుంది.

ఇందులో అధికశాతం కార్బోహైడ్రేట్స్‌ ఉంటాయి.
స్త్రీలు ప్రెగ్నెన్సీ సమయంలో సపోటాను తీసుకోవటం మంచిది అంటున్నారు నిపుణులు.
సపోటాలు తినటం వల్ల వికారం తగ్గుతుంది.

సపోటా ఉడికించిన నీళ్లు డయేరియాను అదుపులో ఉంచుతుందని నిపుణులు చెబుతుతున్నారు.

సపోటా తినటం వల్ల శ్లేష్మం శరీరం నుంచి బయటకు వస్తుంది. జలుబు, దగ్గు తగ్గిపోతాయి. దీంతో పాటు ఒత్తిడిని తగ్గించే గుణం సపోటాకు ఉంది.

కిడ్నీల ఆరోగ్యానికి సపోటా ఉపయోగపడుతుంది. అంతేనా దంతాల ఆరోగ్యానికి ఇవి చాలా మంచివి.

క్యాన్సర్‌ కణాల వృద్ధిని అరికట్టడంలోనూ సపోటాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి.

సపోటా విత్తనాలూ ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కీటకాలు కుట్టిన చర్మభాగంపై ఈ విత్తనాల పేస్ట్‌ పట్టిస్తే నొప్పి తగ్గిపోతుంది. సపోటా విత్తనాల నూనె జుట్టు ఆరోగ్యానికీ ఉపయోగపడుతుంది

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...