షుగర్ ఉన్నవాళ్లు హార్ట్ అటాక్ రిస్క్ నుండి తప్పించుకునే మార్గాలు

September 28, 2016

షుగర్ ఉంటే హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువేనని చెప్పవచ్చు.

ఈసీజీ తీయిస్తే నార్మల్‌గా వచ్చింది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువే ఉన్నాయి.

ఇంకేం… హార్ట్ఎటాక్ వచ్చే ఛాన్సే లేదు అని గుండెపై చేయి వేసుకుని పడుకున్నారా? ఒకసారి లేవండి!

ముందు షుగర్ పరీక్ష చేయించండి.
ఎందుకంటే షుగర్ ఉంటే రక్తనాళాల్లో 90 శాతం పూడిక ఏర్పడే వరకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే డయాబెటిస్ రోగులు క్రమంతప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవాలి.

ఏడాది క్రితం టోటల్ హెల్‌్్చెకప్ చేయించాను. షుగర్‌కు మందులు వాడుతున్నాను.
అంతా బాగానే ఉంది అని అనుకోవద్దు.

ఎందుకంటే డయాబెటిస్ రోగుల్లో ఏడాదిలోనే 70 నుంచి 80 శాతం మేర రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడే అవకాశం ఉంది. గుండెకు వెళ్లే రక్తనాళాలే కాకుండా బ్రెయిన్, కిడ్నీ, కాలు…ఇలా ఏ ప్రాంతంలోనైనా బ్లాక్స్ ఏర్పడవచ్చు.

sugar

• పరీక్షలు
********
సాధారణంగా కొలెస్ట్రాల్ ఎక్కువయితే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుందని అంటుంటాం.
కానీ డయాబెటిస్ రోగుల్లో కొలెస్ట్రాల్ సాధారణస్థాయిలో ఉన్నా బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఎందుకంటే వీరిలో స్టికీ కొలెస్ట్రాల్ ఉంటుంది. దీనివల్ల హార్ట్ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో ఈసీజీ తీయించినా నార్మల్‌గానే ఉంటుంది. ఈసీజీ బేసిక్‌టెస్ట్ మాత్రమే. బ్లాక్ ఉన్నదీ లేనిదీ ఈ పరీక్ష ద్వారా నిర్ధారించలేము. 2డి ఎకో, టీఎమ్‌టీ, సీటీ యాంజియో వంటి పరీక్షలు అవసరమవుతాయి.

• ఎర్లీస్టేజ్
*******
ప్రతీ వ్యాధికి ప్రాథమిక దశ ఉంటుంది. ఆ దశలో గుర్తిస్తే మందులతో సులభంగా తగ్గించుకోవచ్చు. అలాకాకుండా 90 శాతం ముదిరిన దశలో ఆసుపత్రికి వస్తే ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. రక్తనాళాల్లో ఏర్పడే బ్లాక్స్ విషయంలోనూ అంతే.

90 శాతం పూడుకుపోయే వరకు చూసుకోకుండా ప్రాథమిక దశలోనే పరీక్షలు చేయించుకోవడం ద్వారా తెలుసుకోవాలి. మధుమేహ రోగులకు కంప్లీట్ కార్డియాక్ టెస్ట్ బాగా ఉపయోగపడుతుంది. పరీక్షల్లో నార్మల్‌గా ఉంటే రెండేళ్లకొకసారి చేయించుకోవాలి. ఏ మాత్రం తేడా ఉన్నా ఏడాదికొకసారి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి
**************************
షుగర్ వ్యాధిగ్రస్తులు మందులు వేసుకోగానే సరిపోదు. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. 3 నుంచి 4 కిలోమీటర్లు లేదా 45 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.

రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేయకూడదు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా, మధాహ్నం లంచ్ మీడియంగా, రాత్రి డిన్నర్ తక్కువగా తీసుకోవాలి. సూర్యాస్తమయంలోగా డిన్నర్ పూర్తి చేయడం అలవాటు చేసుకోవాలి.

స్మోకింగ్ అలవాటు ఉంటే మానేయాలి.

క్రమంతప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం ఉన్నా గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...