షిరిడీలో సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన చేసింది ఎవరంటే……….

October 4, 2016

దైవాన్ని చేరే మార్గాన్ని చూపించే వ్యక్తే గురువు.
శ్రీ సాయిబాబా కూడా గురువే. గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, పరబ్రహ్మ కూడా.

బాబా మందిరంలో విగ్రహం క్రింది ప్రతిష్ట చేసేది దత్త యంత్రమే. సాయిబాబాకు ప్రత్యేకించి యంత్రం అంటూ ఏదీ లేదు. సాయిబాబాను దత్తాత్రేయ అవతారంగా, అవధూతగా పూజిస్తారు భక్తులు.

sai-baba

15 అక్టోబరు 1918 మంగళవారం బాబా తన అవతారాన్ని చాలించారు. మరుసటి రోజు అంటే 16 అక్టోబరు 1918 బుధవారం మధ్యాహ్నం బాబా పార్థీవదేహాన్ని ఊరేగించి,బూటీవాడాకు తరలించారు.

బాబా కోరిన విధంగానే అణువణువునా ఆధ్యాత్మికతనూ, మహాత్యాన్నీ నింపుకున్న బూటీవాడా మధ్యహాలులో, మురళీధరుణ్ణి ప్రతిష్టించేందుకు నిర్మించిన మందిరంలో బాబాని సమాధి చేశారు.

ఆ సమాధి మీద బాబా చిత్రపటాన్ని ఉంచి, యధావిధిగా పూజలు సాగించారు, హారతి ఇచ్చారు.

ఈ సమాధి మందిరంలోనే సచ్చిదానంద స్వరూపుడైన సాయినాథుని విగ్రహాన్ని
1954లో ముంబాయికి చెందిన బాలాజీ వసంతరావు తాలీము రూపొందించారు.

ఆ సంవత్సరమే స్వామి సాయిచరణ్ ఆనంద్ జీ చేతుల మీదుగా ఈ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...