వీటిని ఇలా కలిపి తింటే అద్భుత ఆరోగ్యం మీ సొంతం

November 27, 2016

అన్నివేళలా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరమూ కోరుకుంటాం. అలా ఉండాలంటే ,కొన్ని పదార్థాలను కలిపి తీసుకుంటే , అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

అవేమిటంటే ………

* రెండు రెబ్బల కరివేపాకు, చిటికెడు పసుపు తీసుకోవాలి. వీటిని కలిపి నూరాలి.
కుంకుడు గింజ పరిమాణంలో రోజూ ఈ మిశ్రమాన్ని తింటే అజీర్ణం దరి చేరదు.

* చెవిపోటు వస్తే చెవిలో రెండుమూడు చుక్కల వెల్లుల్లి రసం వేస్తే కొంత రిలీఫ్ దొరుకుతుంది.

* అల్లం తినడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అల్లం కషాయంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి
సేవిస్తే బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

frtu

* రోజుకు కనీసం అరవై గ్రాముల పెరుగు తింటే చిగుళ్ల వ్యాధులు రావు. పెరుగులో ఉండే లాక్టోబాసిలి అనే
బ్యాక్టీరియా నోటిలో చిగుళ్లపై పేరుకొని ఉండే తీపి పదార్థాలను తిని జీవిస్తాయి. తద్వారా చిగుళ్లు శుభ్రపడి
ఆరోగ్యంగా ఉంటాయి.

* నీళ్లు కాచి చల్లార్చి తాగే అలవాటున్న వారు ఆ నీళ్లల్లో కాస్త సోంపు వేసి కాచి, వడగట్టి తాగండి.
దాహం తీరడంతో పాటు అజీర్తి సమస్యలూ తొలగిపోతాయి.

* తులసి ఆకుల్ని నీళ్లల్లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే నోటి దుర్వాసన తగ్గుతుంది.

* రోజూ గోధుమ జావ తాగితే రక్తపోటు(బీపీ) అదుపులో ఉంటుంది.

* ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

* ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్..కొలెస్ట్రాల్‌ని దరిచేరనివ్వవు.

* జామపళ్లు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

* తరచుగా జలుబు బారినపడేవారు వెల్లుల్లిని రోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

* కంటిరెప్పలపై నొసలపై ఆల్మండ్ ఆయిల్ రాసి మసాజ్ చేస్తే వెంట్రుకలు రాలిపోకుండా నిగనిగ మెరుస్తాయి

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...