విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి

October 4, 2016

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
******************
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి,
ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వల్ల తెలుస్తున్నది.

ఈయన కడప, కర్నూలు అనంతరపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి.

uyyalawada-narasimha-reddy

రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో
ఈయన నిర్మించిన కోటలు నగరులు ఈనాటికీ ఉన్నాయి.

1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం ఇప్పించమని
తన అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపితే……
అక్కడున్న తహసీల్దారు నానారకాలుగా తిట్టి,
నరసింహారెడ్డి వస్తేనే…….. భరణం ఇస్తా….. పొమ్మనడంతో రెడ్డిలో తిరుగు బాటు మొదలైంది.

మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు.

వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదాబాదుకు చెందిన సలాంఖాన్‌, కర్నూలుకు చెందిన పాపాఖాన్‌, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు.

1846 జులై 10 తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను దోచుకున్నాడు.

ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు.

బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టు కోవడానికి సైన్యాన్ని దింపింది.

కెప్టెన్‌ నాట్‌, కెప్టెన్‌ వేయిరూపాల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది.

తరువాత జులై 23వ తేదీన కెప్టెన్‌ వాట్సన్‌ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్థరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు.

ఎలాగైనా నరసింహారెడ్డిని హతమార్చాలని బ్రిటీష్ వారు కుట్రలు పన్నారు.

దానిలో భాగంగా నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదు చేసింది ప్రభుత్వం.

వారిని విడిపించుకునేందుకు కడప చేరాలని నల్లమల ప్రాంతం గుండా బయలుదేరాడు రెడ్డి.

1846 అక్టోబర్‌ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న
కడప యాక్టింగ్‌ కలెక్టర్‌ కాక్రేన్‌ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించాడు.

నరసింహారెడ్డిని, అతని అనుచరులను విచారించిన బ్రిటిషు ప్రభుత్వం అతనికి ఉరిశిక్షను,
అనుచరు లకు వివిధ ఇతర శిక్షలను విధించింది.

1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరితీసింది. బ్రిటిషు ప్రభుత్వం.

విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి
నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...