వడలు , బజ్జీలను న్యూస్ పేపర్లలో పెట్టుకొని తింటే …… 3 డేంజరస్ జబ్బులు

October 31, 2016

నూనె పీల్చేందుకు న్యూస్‌పేపర్‌ వాడితే , ఏం జరుగుతుందంటే………..

పూరీలు, వడలు పీల్చుకున్న అదనపు నూనెను వదిలించటం కోసం వాటిని న్యూస్‌పేపర్‌ మీద వేస్తుంటాం.

అదనపు నూనెను వదిలించి తినటం ఆరోగ్యానికి మంచిదే అయినా
అందుకోసం పేపర్‌ వాడటం మాత్రం హానికరమే! ఎందుకంటే……….

bnp

నూనె వంటకాలను పేపర్‌ మీద వేయగానే దాన్లోని న్యూస్‌ ప్రింట్‌ ఇంక్‌ కరగటం మొదలుపెడుతుంది.

ఈ ప్రింట్‌ ఇంక్‌లోని గ్రాఫైట్‌ తినే పదార్థాల్లోకి చేరి నేరుగా మన శరీరంలోకి చేరుతుంది.

గ్రాఫైట్‌ వల్ల మూత్రపిండాలు, కాలేయం, ఎముకలు, కణజాలం పెరుగుదల దెబ్బతింటాయి.

సాధారణంగా ఎలాంటి హానికారక పదార్థాన్నైనా మన శరీరం సహజసిద్ధంగానే విసర్జిస్తుంది.
కానీ గ్రాఫైట్‌ విసర్జింపబడకుండా శరీరంలో నిల్వ ఉండిపోతుంది.

కాబట్టి అదనపు నూనెను వదిలించటం కోసం న్యూస్‌ పేపర్లకు బదులుగా టిష్యూ పేపర్లనే ఉపయోగించండి.

అలాగే చేతులు తుడుచుకోవటానికి కూడా! న్యూస్‌ పేపర్‌ తడవనంతవరకూ……..
దాన్లోని గ్రాఫైట్‌తో ఎటువంటి ప్రమాదం లేదు.

కానీ తడి లేదా నూనె వల్ల న్యూస్‌ పేపర్‌ తడిస్తే ఇంక్‌ప్రింట్‌లోని గ్రాఫైట్‌ కరగటం మొదలుపెడుతుంది.

కాబట్టి న్యూస్‌ పేపర్‌ను చదవటానికే తప్ప పదార్థాల నిల్వకు, చేతులు తుడుచుకోవటానికి,
అదనపు నూనె పీల్చుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...