వందల మొండి రోగాలను నయం చేస్తున్న వైద్యుడు

November 11, 2016

ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని ఓ కుగ్రామం నిమ్మలగూడెంలో… వారసత్వ సంపదగా వచ్చిన వైద్య విధానంతో జమాల్‌ తన ప్రకృతి చికిత్సాలయం ద్వారా ఎంతో మందికి వైద్య సేవ చేస్తున్నాడు.

ఆయుర్వేదం పరిధిలోకి రాని చెట్టు, మొక్క, తీగ అంటూ ఏదీలేదు. ఆలాంటి అపార వృక్షసముదాయంలోంచి వైద్య సంపదను సృష్టిస్తున్నాడాయన. మన్నెం అటవీ ప్రాంతంలో బీదబిక్కి జనానికి సహజమైన ఓషధులతో తన ప్రకృతి వైద్యశాల ద్వారా సేవ చేస్తున్నాడు.

మన తెలుగు రాష్ట్రాల నుండే కాక… చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, మహారాష్ట్ర నుండి వచ్చే రోగులకు కూడా తన వైద్య సేవలు అందిస్తున్నాడు జమాల్‌ఖాన్‌.కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చుచేసినా తగ్గని మొండి వ్యాధులను వనమూలికలతో… అదీ ఉచితంగా అందిస్తూ… తన సేవా తత్పరతను చాటుకుంటున్న ప్రకృతి వైద్య నిపుణుడు జమాల్‌ నిస్వార్థ సేవలను గురించి ఒక్కసారి చదవండి.

d4

జమాల్‌ఖాన్‌ కుటుంబం వంశ పారంపర్యంగా ఏజెన్సీలో వైద్యం చేస్తూ, ఎందరో రోగులకు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. అడవి నుండి ఔషద గుణాలు ఉన్న మొక్కలను, వేర్లను, దుంపలను సేకరించి, వాటి ద్వారా చికిత్స నిర్వహిస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లోని చింతూరు మండల కేంద్రానికి సరిగ్గా మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న నిమ్మలగూడెం జమాల్‌ఖాన్‌ మూలికా వైద్య ప్రకృతి కేంద్రం.

శబరి నది ఒడ్డున తనకున్న కొద్దిపాటి భూమిలోనే అనేక రకాల వన మూలికలను పెంచుతూ, దాన్ని కుటీర పరిశ్రమగా చేసి వనమూలికలతో మందులు తయారు చేస్తున్నారు. సుమారు 20 మంది సహాయకులతో ఈయన వైద్య సేవలు కొనసాగుతున్నాయి.

జమాల్‌ఖాన్‌ సేకరించే అరుదైన వన మూలికలతో ఎన్నో నయం కాని రోగాలను తగ్గించవచ్చని ఆయన రుజువు చేశారు. ఈ వైద్యశాలలో పాము కాటుకు గురై వచ్చే రోగులకు ఉచితంగా చికిత్స నిర్వహించి,
అనేక మంది ప్రాణాలు కాపాడారు.

ఈయన వద్దకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక, చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది రోగులు వస్తుంటారు. క్యాన్సర్‌, అస్త్మా, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, బిపి, షుగర్‌ వంటి రోగాలను సైతం జమాల్‌ఖాన్‌ నయం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు అనేక మంది రోగులు తమ రోగాలు పూర్తిగా ముదిరిన తర్వాత చివరి దశలో రావడం, మందులు పనిచేసే వరకు ఓపికగా ఉండలేకపోవడంతో ఈ ప్రకృతి వైద్యం అంతగా గుర్తింపునకు నోచుకోవడం లేదని ఈ ప్రాంత వాసులు అభిప్రాయపడుతున్నారు. అందుకనే మానవ అవసరాలకు ఉపయోగపడే ఎన్నో మహత్తర వన మూలికలు నిర్లక్ష్యానికి గురౌతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జలగలతో చేసే వినూత్న చికిత్స ఎలా ఉంటుందంటే …
***************************************
జీవితంపై విరక్తి పుట్టించే దీర్ఘకాలిక గాయాలకు ఈయన చేసే చికిత్స వినూత్నంగా ఉంటుంది. దీర్ఘకాళికంగా ఉన్న పుండ్ల ప్రదేశంలో బురద నీటి నుండి తెచ్చిన జలగలను వదిలి పుండ్లలో పేరుకుపోయి ఉన్న చెడు రక్తాన్ని పీల్పించడం ద్వారా చికిత్స మొదలుపెడతారు. అలా జలగలు చెడు రక్తాన్ని పీల్చివేసిన అనంతరం వైద్యుడు ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి మందుల ద్వారా 10-15 రోజులలో గాయం మానేటట్లు వైద్యం చేస్తారు. ఈ ప్రక్రియలో చికిత్స కోసం జలగలను ఒక రోగికి ఒక్కసారి మాత్రమే వినియోగిస్తారు.

అంతేగాక వివిధ వనమూలికల ద్వారా పక్షవాతం, మధు మేహం, కిడ్నిలో రాళ్లు, కిడ్ని ఫెయిల్యూర్‌, కీళ్లవాతం, కీళ్లనొప్పులు, టి.బి., కాలేయ సంబంధిత వ్యాధులు, రకరకాల కామెర్లు, గర్భసంచి క్యాన్సర్‌, బ్లడ్‌ క్యాన్సర్‌, సైనస్‌, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, తెల్లపొడ, శూలబాధలు, అల్సర్‌, అర్ష మొలలు, మూత్ర సంబంధమైన వ్యాధులు, ఎర్రబట్ట, సెక్స్‌ సంబంధ మైన సమస్యలు, హై, లో బి.పి., కుష్టు, వంటి అనేక రకమైన వ్యాధులను నయం చేస్తున్నారు.

భద్రాచలం మన్నెంలో ప్రకృతి వైద్యంతో పలు దీర్ఘకాలిక రోగాలను ఎలా నయం చేస్తున్నారో తెలుసుకోవాలని, ఎందరో మేధావులు, విద్యావేత్తలు, విదేశాల నుంచి సైతం ప్రొఫెసర్లు వచ్చి ఇక్కడి వైద్య విధానాన్ని తెలుసుకొని వెళ్లారు. డబ్బు ప్రధానంగా ఈ వృత్తిని ఎంచుకోకుండా, జమాల్‌ఖాన్‌ చేసే వైద్య సేవలు పలువురు కొనియాడారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వనమూలికల సేకరణ చాలా కష్టమైన విషయమని, దానిని ఇంతకాలంగా కొనసాగిస్తూ ఉండటం నిజంగా ప్రశంసనీయమని పలువురు వైద్యులు కొనియాడారు.

7 Comments

on వందల మొండి రోగాలను నయం చేస్తున్న వైద్యుడు.
 1. Mukund Reddy mamidi
  |

  Jamalkhan deserves appreciation. Govt. Should take steps to pramote his way of treatment and it should go on record

 2. srinivasachary
  |

  manchi samacharam pettaru total adress and contact nuber kuda pettandi

 3. srinivasachary
  |

  contact numbers and adress vivaralu pettagalaru………adress and contact anumbers vunte problems vunna vallu akkadiki vellagalugutharu

 4. Md.nazeer ahmed 9966710537
  |

  My wife kidney was failure present do peritonial dialosys what can I do for cure the disease pl. Give the suggestion

 5. Bhavani
  |

  Very much useful to the publik at large. Please share with contact details. So that the mission will be compleated.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...