లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం గురించిన వాస్తవాలు

September 25, 2016

లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం సహజమైనదా………కాదా……..ఒక్కసారి చదవండి .

అంతా మీకే అర్థమవుతుంది. దీని వెనుక ఎంతటి కుట్ర దాగి ఉందో…………

lal-bahadur

నీతి , నిజాయితీలకు నిలువెత్తు రూపమైన మన భారత ద్వితీయ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం సహజమైనది కాదు అనేందుకు అనేక కారణాలు ఉన్నాయి.

ఆయన మరణించడానికి కొన్ని గంటల ముందు నుండీ , ఆయన అంత్యక్రియల తర్వాత జరిగిన అనేక సంఘటనల వల్ల ఆ మహానుభావుడి మరణం సహజమైనది కాదు అనేందుకే బలమైన కారణాలు ఉన్నాయి.

1965నాటి భారత్-పాక్ యుద్ధానంతర శాంతి ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నాటి సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్ వెళ్లిన లాల్ బహదూర్ శాస్త్రి(61)…….
సంతకాలు జరిగిన మర్నాడే అనగా 1966, జనవరి 11న హఠాత్తుగా కన్నుమూశారు.

ఆయన గుండెపోటుతో మరణించారని అప్పుడు ప్రకటించారు.
అయితే, ఆయన మృతదేహం నీలంగా మారిందనీ, తెల్లటి మచ్చలు కనిపించాయని చాలామంది చెప్పారు.

అయినా కూడా తాష్కెంట్లో కానీ భారత్‌లో కానీ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించలేదు.
పోస్ట్ మార్టం చేసి ఉంటే మరణానికి అసలు కారణం తెలిసేది.
ఆ మరణం వెనుక కుట్ర ఉండి ఉండొచ్చనేది అప్పట్లోనే అందరూ భావించారు.

తాష్కెంట్ హోటల్ లోని ఒక వెయిటర్‌ను మాత్రం అరెస్ట్ చేసి, తర్వాత కొన్నాళ్ళకు వదిలేశారు.
కొన్ని సంవత్సరాల తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి భార్య తాష్కెంట్‌కు వెళ్లినప్పుడు ఆ వెయిటర్‌ను కలవాలనుకుంది. కానీ అతడు ఎక్కడున్నాడో తెలియదని రష్యా అధికారులు తప్పించుకున్నారు.

శాస్త్రి గారికి ప్రతిరోజూ డైరీ రాసే అలవాటుంది.
కానీ ఆయన మరణించిన రూమ్ లో నుండి డైరీ మాయమైంది.

అంతేగాకుండా లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయినప్పుడు…..
ఆయన బెడ్ పక్కన ఉన్న థర్మాస్ ఫ్లాస్క్ ను ఇండియాకు తీసుకురాలేదు.

ఆ థర్మాస్ ప్లాస్క్ లోని పాలు త్రాగడం వల్లే ఆయన మరణించారని అందరూ అనుమానించారు.

అంటే ఆ ప్లాస్క్ లో విషం కలపడం వల్లే ,
మరణం తర్వాత ఆయన శరీరం నీలి రంగులోకి మారి ఉంటుందనేది అప్పట్లో చాలా మంది విశ్వసించారు. అందువల్లే ఆ ప్లాస్క్ ను మాయం చేసారు.

ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే ,
శాస్త్రి గారి మృతిపై దర్యాప్తు జరుపుతున్న కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉన్న
ఆయన వ్యక్తిగత డాక్టర్, ప్రధాన సహాయకుడు ఇద్దరూ వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారు.

వారు చనిపోయిన విధానం కూడా బయటకు ప్రమాదాలుగా ప్రచారం జరిగినప్పటికీ ,
జరిగిన తీరు ఒకే విధంగా ఉండటంతో ఏదో కుట్ర జరిగిందని అందరికీ అనేక అనుమానాలకు తావిచ్చింది.

లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణానికి సంబంధించిన అసలు నిజాలు బయటకు రాకుండా అప్పటి ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నించడంతో ఒక మహానుభావుడి మరణం నేటికి కూడా ఒక మిస్టరీగానే ఉండిపోయింది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...