లక్ష మంది హైస్కూల్ విద్యార్థులకు స్కాలర్ షిప్పులు

October 27, 2016

కేంద్ర ప్రభుత్వం జాతీయ మెరిట్ కం మీన్స్ స్కాలర్ షిప్ ద్వారా తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందిస్తోంది. స్కూల్ విద్యా స్థాయిలో బడి మానేసే పిల్లల సంఖ్యను తగ్గించడం ఈ స్కాలర్ షిప్పుల లక్ష్యం .

schr

దేశ వ్యాప్తంగా ఏటా లక్ష మందిని ఈ స్కాలర్ షిప్పులకు ఎంపిక చేస్తారు .
ఎంపికైన వారికి ఏడాదికి రూ. 6000 /- స్కాలర్ షిప్ లభిస్తుంది .

తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్పులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ , ప్రభుత్వ సహాయంతో నడిచే స్కూల్స్ , స్థానిక సంస్థలు నడిపే స్కూల్స్ లో చదివే విద్యార్థులు మాత్రమే అర్హులు.

నవోదయ స్కూల్స్ , కేంద్రీయ స్కూల్స్ , ప్రైవేటు , రెసిడెన్షియల్ స్కూళ్ళ విద్యార్థులు అర్హులు కాదు.

ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ వరకు స్కాలర్ షిప్ లబిస్తుంది. పదో తరగతిలో కనీసం అరవై శాతం మార్కులు సాధిస్తేనే స్కాలర్ షిప్పులను పునరుద్ధరిస్తారు.

నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ ద్వారా సంబంధిత స్కూళ్ళ వివరాలను నమోదు చేయాలి. ఈ వివరాలను D.E.O. , STATE NODAL OFFICERS తనిఖీ చేసి స్కాలర్ షిప్పులకు సిఫారసు చేస్తారు.

వెబ్ సైట్ : scholarships.gov.in

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...