లక్ష్మీదేవిని శుక్రవారమే ఎందుకు పూజించాలంటే………..

November 2, 2016

అసలు శుక్రవారమే లక్ష్మీదేవికి ఆరాధనకు అనుకూలమైన రోజుగా ఎందుకు పేరుమోసింది?
రాక్షసులు కూడా ఆరోజే లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధించేవారు?
అందునా రాక్షస సంహారి అయిన విష్ణుమూర్తి భార్యను రాక్షసులు పూజించడమేమిటి?
ఈ సందేహాలన్నీ వస్తాయి.

ఈ సందేహాలకు సమాధానం ఏమిటంటే ….

lakshmi

రాక్షసుల గురువు శుక్రాచార్యుడు.
ఈ శుక్రాచార్యుల పేరుమీదుగానే శుక్రవారం ఏర్పడిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి.
ఇకపోతే శుక్రాచార్యుడి తండ్రి భృగుమహర్షి. ఈ భృగుమహర్షి బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు.
ఇతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా! అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరు.
ఈ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు. అందుకే ఆమెకు శుక్రవారం అంటే ప్రీతికరమైనది.

లక్ష్మీదేవి రూపురేఖలలో వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం వుంది.
లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు.

ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిథి.
అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు.
ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు.

బంగారం ఐశ్వర్యనికి సంకేతం. ఐశ్వర్యాధిదేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీపూజకు ప్రాధాన్యం ఉంది.

లక్ష్మీదేవి అనుగ్రహంతో కానీ, విష్ణుమూర్తిని దరిచేరలేరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం, సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు.

ఈ రెండూ ఉంటె ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...