లక్షల డబ్బుతో వచ్చి బ్యాంకు అధికారులకు షాకిచ్చిన బిక్షగాడు

November 16, 2016

మాసిన బట్టలు ……… నెరిసిన వెంట్రుకలు ……. చేతిలో ఒక పాత సంచితో ఒక వ్యక్తి బ్యాంకులోకి ఎంటరయ్యాడు. అక్కడున్నవారంతా అలాగే చూస్తుండగానే ….. ఆ సంచిలో నుండి నోట్ల కట్టలను బయటకు తీసాడు….. అంతే అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు….

bno

అసలు వివరాల్లోకి వెళితే……..

అతనొ బిచ్చగాడు.. రోజూ గుళ్ల దగ్గరా, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటూ ఉంటాడు. దయతలచిన వారు రూపాయి, రెండు రూపాయలు వేస్తారు.. కొందరు తిండి పెడతారు. అలాంటి బిచ్చగాడి దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.50 లక్షల రూపాయలు ఉన్నాయి.

నోట్ల రద్దు ఏం చేయాలో తెలియక కొందరు తగలబెడుతుంటే.. ఈ బిచ్చగాడు మాత్రం నోట్ల మూటలతో.. బిచ్చగాడి అవతారంలోనే నేరుగా బ్యాంక్ కు వచ్చాడు.

వికారాబాద్ జిల్లా తాండూరులోని కొడంగల్ రోడ్డులోని ఓ కమర్షియల్ బ్యాంక్ లో ఈ ఘటన జరిగింది.

చిరిగిపోయిన దుస్తులు, మాసిన గడ్డంతో బిచ్చగాడి బ్యాంక్ లోకి ఇచ్చాడు. మొదట అందరూ చీదరించుకున్నా.. అతని దగ్గర ఉన్న డబ్బుల మూట చూసి విస్తుపోయారు.

అన్ని రూ.500, 1000 నోట్లు. ఇది చూసిన బ్యాంక్ సిబ్బంది షాక్ అయ్యారు.

ఈ డబ్బు ఎక్కడిది అని అడిగారు.

మా కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఉందని.. ఇటీవలే అమ్మితే రూ.50లక్షల రూపాయలు వచ్చాయని చెప్పాడు. బ్యాంక్ అకౌంట్ లేదని.. ఓపెన్ చేసి డబ్బు డిపాజిట్ చేయాలని కోరాడు.

బ్యాంక్ అధికారులు మొదట నిరాకరించారు.

తర్వాత పాన్ కార్డ్ కావాలని అడిగారు. వెంటనే జేబులోని కార్డ్ తీసి చూపించాడు.

షాక్ అయిన ఆఫీసర్స్.. ల్యాండ్ అమ్మినట్లు డాక్యుమెంట్లు కావాలని మళ్లీ అడిగారు.

ప్రస్తుతం తన దగ్గర లేవని.. ఆధారాలతో మళ్లీ వస్తానని బ్యాంక్ నుంచి వెళ్లిపోయాడు ఆ బిచ్చగాడు.
అతని కుటుంబం మొత్తం బిచ్చం ఎత్తుకునే బతుకుతుంది అని చెప్పాడు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...