రాత్రిపూట మొబైల్ ను చార్జింగ్ చేస్తే …… కలిగే నష్టమెంతంటే……..

November 7, 2016

రాత్రి పూట పెట్టే చార్జింగ్ తో కలిగే నష్టం ఎంతగా ఉంటుందంటే……..

జీవితంలో మనం ఏది చిన్న విషయం అనుకుంటామో అది చాలా పెద్ద విషయంగా మారవచ్చు.
అధిక ప్రభావాన్నీ చూపించొచ్చు. అలాంటి కోవలోకి చెందినదే ‘సెల్‌ఫోన్‌ చార్జింగ్‌’.

నిద్రపోయే ముందు సెల్‌చార్జింగ్‌ చేసి ఉదయాన్నే చార్జింగ్‌ను తీసేసే వారు
ఈ విషయం తెల్సుకుంటే అసలైన విషయం బోధపడుతుంది.

mobile

ప్రతి రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ చేస్తుంటాం.
సాధారణంగా మొబైల్‌ రెండు గంటల్లోపే చార్జింగ్‌ ఫుల్‌ అవుతుంది.
దీనికి నాలుగు వాట్స్‌ కరెంట్‌ ఖర్చవుతుందట.

అయితే మనం రాత్రంతా అంటే దాదాపు ఆరుగంటల పాటు సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పిన్‌ తీయకుండా వాడితే మొత్తం 24 వాట్స్‌ కరెంటు ఖర్చు అవుతుంది.

మన భారతదేశంలో సుమార్‌ ఎనభై కోట్ల మందికి సెల్‌ఫోన్స్‌ ఉన్నాయి. వీరిలో దాదాపు పదిశాతం అంటే ఎనిమిది కోట్ల మంది ప్రతి రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టి మర్చిపోతే 19.2 లక్షల కిలోవాట్స్‌ కరెంట్‌ ఏ పనికీ ఉపయోగపడకుండా అనవసరంగా ఖర్చు అవుతుంది.

ఈ 19.2 లక్షల కిలో వాట్స్‌ కరెంట్‌ను మెగావాట్స్‌లో 1920 మెగావాట్స్‌ అవుతుంది. ఒక మెగా వాట్‌ కరెంట్‌ను తయారు చేయటానికి ప్రభుత్వం ఐదు కోట్ల ఖర్చు పెడుతోంది. అంటే దాదాపు 1920 మెగావాట్స్‌ కరెంట్‌ తయారు చేయడానికి పదివేల కోట్లు ఖర్చుపెడుతుంది.

కేవలం సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ కోసం వేస్టేజ్‌ అయిన కరెంట్‌కు మన ప్రభుత్వం ఇంత విలువ చెల్లించటం, అదంతా చివరికి మన తలకు ట్యాక్స్‌ రూపంలో పడుతోంది. సో.. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ విషయంలో ఈ రోజునుంచైనా జాగ్రత్తపడండి, మిగతా విషయాల్లోనూ కరెంట్‌ను ఆదా చేయండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...