రాగులు ఆరోగ్యానికి ఎంత బలమంటే…………

October 12, 2016

రాగులు యొక్క ఉపయోగములు

1) రాగుల మొక్క యొక్క .. ఆకులు , మరియు రాగుల కంకులని తీసుకోవాలి … ఒక పాత్రని తీసుకొని ..స్టౌ పైన పెట్టి సన్నని సెగ పైన ఉంచి .. నీరు పోసి దీంట్లో .. రాగి మొక్క యొక్క ఆకులని చిన్న చిన్న ముక్కలు గా చేసుకొని వేసుకోవాలి ,, మరియు రాగి కంకులని వేసి బాగా మరిగించాలి … కషాయము లాగా మరిగించాలి .. ఒక గ్లాసు నీరు అర గ్లాసు కి రావాలి .. ఇలా కషాయము లాగా వచ్చాక వడకట్టి తాగాలి .. ఇలా తాగడం వల్లశరీరం లో ఉన్న కొవ్వు ని తగ్గిస్తుంది రక్తము లో ఉన్న క్రొవ్వు తగ్గుతుంది.

*పిల్లలు పుట్టే సమయం లో vagainal bleeding ని నివారిస్తుంది.

raagulu

2) రాగులని తీసుకొని మిక్సీ లో వేసి పేస్ట్ లాగా చేసుకొని .. వడకట్టాలి పేస్ట్ ని లేదా ఒక పలుచతి

వస్త్రము లో ఈ పేస్ట్ ని వేసి బాగా పిండాలి … తరువాత రాగుల పాలు వస్తాయి .. ఒక పాత్ర తీసుకొని స్టౌ పైన పెట్టి సన్నని సెగ మీద ఉంచాలి దీంట్లో రాగుల పాలు తీసుకొని దీంట్లో కొన్ని నీరు పోసి బాగా మరిగించాలి .. కొంచెము చిక్క గా ఆయ్యక .. స్టౌ ఆపేసి దీంట్లో కాస్త చేక్కెర , కొన్ని పాలు పోసి బాగా కలిపి పి‌ల్లకి ఇవ్వాలి .. దీని పిల్లలు తాగడం వల్ల ఎముకలని బలాన్ని ఇస్తుంది. శరీరానికి పౌష్టీక ఆహారాన్ని ఇస్తుంది.

3) శుభ్రం చేసిన రాగులని తీసుకొని పొడి లేదా రాగులని మిక్సీ లో వేసి కచ్చా పచ్చి గా అయిన చేసుకోవచ్చు .. ఒక పాత్ర ని తీసుకొని స్టౌ పైన పెట్టి నీరు పోసి .. కొంచెము రాగుల పొడి వేసి బాగా మరిగించాలి .. కొంచెము చిక్క గా వచ్చినప్పుడు … స్టౌ ఆపేసి … దీంట్లో చిటికెడు ఉప్పు వేసి తాగాలి .. రోజు కి ఒక గ్లాసు తాగితే సరిపోతుంది ఇలా తాగడం వల్ల రక్త పోటు తగ్గుతుంది .

రక్తం లో ఉన్న కొవ్వు తగ్గుతుంది . చక్కెర వ్యాధి ని తగ్గిస్తుంది. ఎముకల కి బలాన్ని చేకూరుస్తుంది .
శరీరం లో ఉన్న కొవ్వు ని తగ్గిస్తుంది . నీరసముని రానివ్వదు.
మల బద్దకాన్ని తగ్గిస్తుంది.

4) రాగిపిండిని తీసుకొని దీంట్లో కొంచెము వేడి నీరు పోసి కాస్త ఉప్పు వేసి బాగా కలిపి ముద్దలాగా చేసుకోవాలి .. తరువాత వీటిని రొట్టెలు లాగా చేసుకోవాలి .. ఒక పెనం తీసుకొని స్టౌ పైన పెట్టి … దీంట్లో కొంచెము నెయ్యి తీసుకొని రొట్టెలని కాల్చికోవాలి .. ఈ రొట్టెలని చల్లరానివ్వాలి .. వేరుశనగ పప్పులని నూనె లేకుండా వేయించుకోవాలి .. తరువాత పొట్టుతీసుకొని ఉంచుకోవాలి .. .. ముందు మిక్సీ లో కాల్చిన రొట్టెలని ముక్కలు ముక్కలు గా చేసి వేసి కాసేపు మిక్సీ వేసి తరువాత వేరుశెనగ పప్పులని వేసి మిక్సీ వెయ్యాలి .. తరువాత చివరిగా కొంచెము బెల్లము వేసి మిక్సీ వేసి తిప్పాలి .. తరువాత వచ్చిన మిశ్రమమము ఉండలు చుట్టుకొనే విధము గా ఉంటుంది .. వీటిని ఉండలు గా చుట్టుకొని రోజు కి రెండు లేదా మూడు తినాలి .. ఇలా తినడం వల్ల రక్త హీనత ని తగ్గిస్తుంది.

ఎముకలకీ బలముని చేకూరుస్తుంది. శరీరముని ఎండి పోకుండా చేస్తుంది. చక్కెర వ్యాధి ఉన్న వారు … బెల్లము వేసుకోకుండా తినవచ్చు.

5) ఒక పాత్ర తీసుకొని స్టౌ పైన పెట్టి నీరు పోసి దాంట్లో కొద్ది గా రాగుల పిండి వేసి బాగా దగ్గర గా రానివ్వాలి .. తరువాత స్టౌ ఆపేసి ..శరీరము తట్టుకొనే విధము గా ఉంచి .. శరీరము లో ఎక్కడ అయిన వాపు లేదా .. నొప్పి ఉన్న ప్రదేశము లో …. పట్టు లేగా వేస్తే నొప్పి వాపు తగ్గిపోతాయి .

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...