రాగిపాత్రలో నీళ్ళు ఆరోగ్యానికి ఎంత మంచిదంటే…………..

September 21, 2016

రాగి పాత్ర‌లో మంచినీళ్ళు తాగితే ఎంత మంచిదో తెలుసా…………..?

రాబ్ రీడ్ అనే మైక్రో బయాలజిస్ట్ ప్లాస్టిక్, మట్టి, రాగి పాత్రల‌లో విరోచనాకారి అయిన బాక్టీరియాతో కూడిన నీటిని వాటిలో ఉంచి, 48 గంటల తరువాత ఆ నీటిపై ప‌రిశీల‌న చేశాడు. రాగి పాత్రలో ఉంచిన నీళ్ళ‌లో బాక్టీరియా శాతం తగ్గింది. అదే ప్లాస్టిక్, మ‌ట్టి పాత్రలో ఉన్న బాక్టీరియా శాతం రెండింతలు అయ్యింది.

రాగి పాత్ర వ‌ల్ల ఉప‌యోగాలు:

* జీర్ణ వ్యవస్థకు మంచిది: రాగి పాత్రలో నీరు తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటివి తగ్గడమే కాకుండా, కడుపుకి హాయి కలిగించి, ప్రాణాంతకరమైన బాక్టీరియాను కూడా నిర్మూలిస్తుంది. కిడ్నీ, లివర్ చురుకుగా పనిచేయడంలో తోడ్పడుతుంది.

* బరువు తగ్గిస్తుంది: మనం అధిక బరువు తగ్గడానికి రకరకాల పండ్లు, కూరగాయలు వంటివి తింటూ ఉంటాం. కాని వాటివల్ల వచ్చే ప్రయోజనాల కన్నా, వాటికి ఖర్చుపెట్టిన డబ్బు వ్యర్ధం అయిందన్న దిగులే ఎక్కువ. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల అది జీర్ణ వ్యవస్థను సరైన మార్గంలో నడిచేలా చేసి, కొవ్వు మరియు ఇతర చెడు బాక్టీరియాను శరీరం నుండి తీసేస్తుంది.

* గాయాలను త్వరగా నయం చేస్తుంది: రాగిలో ఉండే యాంటి-బాక్టీరియాతత్వం శరీరంలోని అనేక గాయాలను వేగంగా నయం చేయడంతోపాటు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి, శరీరంపై ఉన్న గాయాలనే కాకుండా లోపల ఉన్న గాయాలను, ముఖ్యంగా కడుపులో ఉన్న గాయాలను కూడా తగ్గించడంలో సహాయం చేస్తుంది.

* క్యాన్సర్ వ్యాధి నుండి పోరాడుతుంది: రాగిలో ఉండే యాంటి-ఆక్సిడెంట్స్ క్యాన్సర్ వంటి ప్రాణాంతకరమైన రోగాల నుండి కాపాడుతాయి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వారు చేసిన పరిశోధనాల ప్రకారం రాగి క్యాన్సర్‌ను ఎలా రానివ్వకుండా చేస్తుందో కనుగొనలేకపోయారు. కాని రాగి నిరంతరం క్యాన్సర్ వ్యాపింపజేసే వైరస్‌ను అడ్డుకోవడంలో తోడ్పడుతుందని ఆ పరిశోధనల్లో తేలింది.

* మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది: మన శరీర భాగంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి మెదడు. మనిషి శరీరంలో ప్రతీ ఒక్క భాగానికి మెదడుతో సంబంధాలు కలిగి ఉంటాయి. మెదడు నుండి ఆయా భాగాలకు న్యురాన్ల ద్వారా సంకేతాలు అందుతాయి. ఈ న్యురాన్లను మైలిన్ తొడుగు కాపాడుతుంది. రాగిలో ఉండే విలువైన పదార్థాలు ఈ మైలిన్ తొడుగును కపాడంతోపాటు, మెదడును చురుకుగా, యవ్వనంగా తయారుచేస్తుంది.

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారి ప్రకారం రాగిని రోజుకు 12మి.గ్రా కన్నా ఎక్కువ తీసుకునే అవసరం లేదు అంటే రాగి పాత్రలో కనీసం 8 గంటలు ఉంచిన మంచి నీటిని రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకుంటే సరిపోతుంది. అలా గే రాగి పాత్రని సబ్బుతో కాకుండా సగం కోసిన నిమ్మ చెక్కతో లేదా వంట సోడాతో రుద్ది నీటితో కడిగితే సరిపోతుంది.

ragi

* రాగి పాత్రలతో అనారోగ్యానికి చెక్ పెట్టేయండిలా!

మన భారత దేశంలో శతాబ్దాలకు మునుపే నీరును శుభ్రపరిచేందుకు రాగిప్రాతలు వాడేవారు. రాగి చెంబులతో నీరును త్రాగేవారు. మరి ఈ రాగి చెంబులు వాడటంలోని అంతర్యం ఏమిటి? అని పరిశోధకులు పరిశీలించారు. ఈ పరిశోధనల్లో వారికి ఎన్నో అశ్చర్యకరమైన నిజాలు తెలిశాయి. సూర్యకిరణాలు రాగి పాత్ర నీటిలో పడినప్పుడు సంభవించే రసాయన క్రియ కారణంగా అందులోని సూక్ష్మక్రిములు చనిపోతాయని గ్రహించారు.

భారతీయ సాంప్రదాయల్లో ఒకటిగా రాగి పాత్రలను ఉపయోగించడం జరుగుతుంది. రాగి పాత్రలో నీటిని త్రాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చును. శరీరంలో కాపర్‌ నిల్వలు తగ్గిపోవడం కారణంగా థైరాయిడ్‌ సమస్య వస్తుంది. దీంతో ఎక్కువ మొత్తంలో థైరాయిడ్‌ శరీరంలోకి విడుదలై హైపర్‌ థైరాయిడిజం సమస్య వస్తుంది. కాబట్టి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగితే నీటిలోని అయానికత వల్ల శరీరంలో కాపర్‌ నిల్వలు పెరుగుతాయి. ఫలితంగా థైరాయిడ్‌ సమస్యలను నివారించవచ్చు.

అజీర్తి, కడుపులో మంట, ఎసిడిటీ మొదలైన జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు రాగి చెంబులో నీరు తాగితే ఫలితం ఉంఉంది. అలాగే మెదడుకు సంకేతాలను అందించడంలో తోడ్పడే న్యూరాన్‌ లకు కవచంలా ఉపయోగపడే మైలీన్‌ తొడుగులు తయారు కావడానికి రాగి పాత్రలో ఉంచిన నీరు చాలా ఉపయోగపడుతుంది. పైగా నీటిలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

లోహాలు జరిపే స్టెరిలైజింగ్‌ చర్యలో భాగంగా రాగి బ్యాక్టీరియాను చంపుతుంది. నీటి ద్వారా వ్యాపించే డయేరియా లాంటి వ్యాధులు రాకుండా చేయడంలో ఇది సహాయపడుతుంది. శరీరంలోని రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేయడంలో కాపర్‌ తనవంతు పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో క్యాన్సర్‌ కణాలు ఏర్పడకుండా నివారిస్తుంది. అంతేకాదు, బరువు తగ్గిస్తుంది. ఎముకలు పటిష్టత ఆర్థరైటిస్‌, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వంటి సమస్యలను నివారించడంలో రాగి పాత్రలో నీళ్ళు ఎంత గానో ఉపయోగపడతాయి.

3 Comments

on రాగిపాత్రలో నీళ్ళు ఆరోగ్యానికి ఎంత మంచిదంటే…………...
  1. S prakash Kumar
    |

    Easy&simple remidies to follow

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...