రజనీకాంత్ రాసిన ఓపెన్ లెటర్ లో ఏముందంటే………….

November 1, 2016

సినిమా పరిశ్రమ అంటే మూడు పొగడ్తలు …….. ఆరు ప్రశంసలు ……,
ముఖస్తుతి చేస్తూనే అవకాశాలు…… ఇది మనందరికీ తెలిసిన విషయమే .

అలాంటి సినిమా పరిశ్రమలో తన గురించిన మంచితో పాటు , చెడును కూడా నిజాయితీగా అంగీకరించే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటివారిలో ముందుంటారు మన సూపర్ స్టార్ రజనీ కాంత్.

untitled-ra

హీరో సూర్య , కార్తీ ల తండ్రి అయిన సీనియర్ నటుడు శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా
ఒక పుస్తకాన్ని విడుదల చేసారు. ఈ సందర్భంగా శివకుమార్ తో తన అనుబంధం గురించి వివరిస్తూ
రజనీ ఒక లేఖ రాశారు.

“ శివకుమార్ తో నేను నటించిన సినిమాలు రెండే కావొచ్చుగానీ …..
ఆయనతో పరిచయం వల్ల నేను నేర్చుకున్న మంచి అలవాట్లను జీవితాంతం మరిచిపోలేను.
అప్పట్లో నేను సిగరెట్లు , మద్యానికీ బానిసగా ఉండేవాడిని .
ఈ దురలవాట్లకు దూరంగా ఉండు రజనీ ….. నటుడిగా ఉన్నత స్థితికి చేరుకుంటావు ,
ఆరోగ్యమూ బాగుపడుతుంది “ అని శివకుమార్ పదే పదే చెబుతుండేవారు.

ఈ మనిషి ఇలా వేధిస్తున్నాదేమిటా అని నేను విసుక్కున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఆయన సలహాల వెనకున్న ఆంతర్యాన్ని గ్రహించాను. దురలవాట్లను క్రమేణా తగ్గించుకుంటూ వచ్చాను .

శివకుమార్ నాపై చూపించిన అభిమానాన్ని ఎన్నడూ మర్చిపోలేను.
ఆయన నిజాయితీపరుడు , మహోన్నత వ్యక్తి .
ఆనాటి శివకుమార్ మాటలు తర్వాత పాటించాను , అవి ఫలించి నేను ఉన్నత నటుడిగా ఎదిగాను.

శివకుమార్ చెప్పే ప్రతి మాటను పాటిస్తే మంచిపౌరులుగా , మంచి కళాకారులుగా నిలుస్తాం ” అని
రజనీ కాంత్ తన లేఖలో పేర్కొన్నారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...