మొలలు తగ్గాలనుకుంటే …….. ఇంటి వైద్యంతో ఇలా చేయండి

November 19, 2016

అనేక సంవత్సరాల నుండీ ఆర్శమొలలతో బాధపడేవారు
ఇప్పటికైనా అసలైన ఔషధాలు మన ఆహార రూపంలోనే ఉన్నాయని తెలుసుకోవాలి.

molalu

ఉల్లిగడ్డలు దంచి పిండి తీసిన రసం 20 గ్రాములు, పంచదార 10 గ్రాములు, కలిపి ఉదయం పరగడుపున ఒకసారి, రాత్రి ఆహారనికి గంటముందు ఒకసారి రెండుపూటలా సేవించాలి.

ఆహారం లో పలుచని తీయని మజ్జిగని బాగా వాడాలి.

దుంపలు, మాంసాహారాలు ఇంకా మీ శరీర తత్వానికి పడని మరియు అరగని పదార్ధాలు మానుకోవాలి.

ఇలా చేస్తే , అతి సునాయాసంగా మూడు నాలుగు వారాల్లోనే ఎంతో కాలం నుండీ వేధించే
మొలల సమస్య నిర్మూలనమౌతుంది.

అదే విధంగా ,

శొంఠి, పిప్పళ్ళు , కరక్కాయలు వీటిల్లో ఏదో ఒకదానితో సమభాగంగా బెల్లం కలిపి దంచి,
ప్రతిరోజూ రెండు పూటలా 5 గ్రాములు మోతాదుగా సేవిస్తుంటే మొలలు కరిగిపోతాయి.
అజీర్ణము, మలబద్ధకం కూడా తగ్గిపోతాయి.

కానుగ లేత ఆకుల్ని మెత్తగా నూరి రక్తం కారే మొలలకు కడితే,
కొద్దిరోజుల్లోనే రక్త మొలల వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది.

వెల్లుల్లిని నిప్పులపై వేసి ఆ పొగను ఆసనానికి పడుతుంటే రక్తమొలలు పిలకలు తగ్గుతాయి.

కందను కూరగా వండుకుని తింటూ వుంటే 5,6 రోజుల్లో మొలల బాధ నివారణ అవుతుంది.

బప్పాయి పండ్లు తరుచుగా తింటూ వుంటే మూలవ్యాధులు తగ్గిపోతాయి.

వేప పండ్లను రోజూ 5,6 తింటూ వుంటే వేపపండ్లు ఉండే రుతువు పూర్తయ్యేసరికి మొలలు తగ్గిపోతాయి.

నీరుల్లి(ఉల్లిగడ్డల) పాయలను ముక్కలుగా తరిగి నేతితో దోరగా వేయించి, ఆ ముక్కల మీద తగినంత పంచదార చల్లి రెండు పూటలా తింటూ వుంటే రక్తం పడే మొలలు తగ్గుతాయి.

రోజూ రెండు పూటలా భోజనం చేసిన తరువాత 10 గ్రాములు కరక్కాయ పొడిని పుల్లటి మజ్జిగలో కలుపుకుని తాగుతూ వుంటే మూల వ్యాధి పిలకలు వూడిపడిపోతాయి.

మూలవ్యాధి కలవారు ఎక్కువగా జామకాయలను తింటూ వుంటే మొలల బాధ శాంతిస్తుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...