మైదా పిండి వల్ల ఆరోగ్యానికి కలిగే హాని ఏమిటంటే……………

September 28, 2016

గోధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి, రాగుల నుండి రాగిపిండి వస్తుంది.

కానీ మైదా పిండి వేటి నుండి వస్తుంది……..? ఎప్పుడైనా ఆలోచించారా………?

మైదా పిండి ఎలా వస్తుంది……..?

అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ……..

ఒక్కసారి దీన్ని చదివితే మీకు అర్థమవుతుంది.

మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు.

బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా , ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను,
చూడటానికి తెల్లగానూ ఉంటుంది.

maidhaa

దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు.
కొన్ని తపాలాకార్యాలయాల్లో కూడా కవర్లు అంటించడానికి,
గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు.

మైదాపిండితో రవ్వ దోసె వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ, కేక్స్, కాజాలు, హల్వా, జిలేబీ
మొదలైన మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేస్తున్నారు.

మన ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు
****************************
మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల మధుమేహం,
గుండె జబ్బులు రావడం, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి.

ఈ విషయాన్ని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ తెలియజేసి జాగ్రత్తపరచండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...