మెదడు , నరాలు , గుండె మరియు కిడ్నీలకు పూర్తి ఉచిత వైద్యం

September 26, 2016

మెదడు , నరాలు , గుండె మరియు కిడ్నీలు వీటిలో దేనికి సంబంధించిన జబ్బు ఉన్నా ఒక్క పైసా కూడా వైద్య ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా వైద్యం చేసే ఆసుపత్రి ఒకటి ఉందని మీకు తెలుసా………..?

అవును …….మీరు చదువుతున్నది నిజమే……….. మెదడు, నరాలు ,గుండె మరియు కిడ్నీలకు సంబంధించిన ఎటువంటి పెద్ద ఆపరేషన్ అయినా ఉచితంగా చేసే ఆసుపత్రి బెంగుళూరు లోని
వైట్ ఫీల్డ్ లో ఉంది.

sss-hospital-bangalore

శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా పిలువబడే ఈ ఆసుపత్రిలో
రోగులకు ప్రపంచ స్థాయి కార్పోరేట్ వైద్యం పూర్తి ఉచితంగా అందుతుంది.

మెదడు , నరాలు , గుండె మరియు కిడ్నీలకు సంబంధించి మీరు ఇంతకముందు ఇతర ఆసుపత్రులలో చూపించుకున్న మెడికల్ రిపోర్టులను తీసుకొని, ఉదయం ఆరు గంటల కల్లా ఈ ఆసుపత్రి ముందు
క్యూ లో ఉన్నట్లయితే , ఏడు గంటల నుండి టోకెన్ల ద్వారా ఆసుపత్రిలోపలికి అనుమతిస్తారు.

దేశంలోని వివిధ దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు తెల్లవారుజామున మూడు గంటల నుండే
క్యూలైన్లలో వేచి చూస్తూ ఉంటారు.

అక్కడ లోపల ఉన్న ప్రత్యేక గదిలో పాత మెడికల్ రిపోర్టులను పరిశీలించి , ఏయే జబ్బులకు సంబంధించి , ఆయా విభాగపు వైద్యుల రూముల దగ్గరికి లోపలికి పంపిస్తారు.

పేషంట్ దృవీకరణ కోసం ఓటర్ కార్డుగానీ, ఆధార్ కార్డుగానీ, రేషన్ కార్డు గానీ ఉంటే మంచిది.
పేషంట్ తో పాటు మరొకరిని కూడా తోడుగా లోపలికి అనుమతిస్తారు.

బెంగుళూరు రైల్వే స్టేషన్ నుండి , బస్టాండ్ నుండి వైట్ ఫీల్డ్ కు సిటీబస్సు సౌకర్యం ఉంది.
ఏ సమయంలోనైనా ఆటో సౌకర్యం కూడా ఉంటుంది.

7 Comments

on మెదడు , నరాలు , గుండె మరియు కిడ్నీలకు పూర్తి ఉచిత వైద్యం.
 1. s.m.rao
  |

  Thanks for your wonderful information

 2. Siddu
  |

  Very nice sir.hospitalll address sir

 3. Srinivas
  |

  Very good information to poor families
  Thank you very much to all of these hospitals

 4. Mahipal pattem
  |

  మంచి పని వినియొగించుకొండి

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...