మెడ నొప్పిని ఇలా చేసి తగ్గించుకోండి

November 11, 2016

ఈ బిజీ లైఫ్ లో చాలామందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే సర్వైకల్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్తవయసులో ఉన్నవారు సైతం సమస్యను ఎదుర్కొంటున్నారు. తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.

కారణం ఏమిటంటే :

మెడ వెనక భాగంలో తల నుంచి మొదలయ్యే మొదటి ఏడు వెన్నుపూసల మధ్య కార్టిలేజ్ (మృదులాస్థి) అనే మెత్తటి ఎముక ఉంటుంది. వెన్నుపూసలు సులువుగా కదలేందుకు ఈ కార్టిలేజ్ తోడ్పడుతుంది. అయితే సరిగా కూర్చోకపోవడం, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులు నిర్వర్తించడం, ఒకేచోట గంటల తరబడి కదలకుండా పనిచేయడం, నిత్యం తీసుకునే ఆహారంలో క్యాల్షియం, విటమిన్స్ తగినంత లేకపోవడం మొదలైన కారణాలతో ఈ కార్టిలేజ్ క్షీణించడం జరుగుతుంది. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పులవల్ల మెడనొప్పి వస్తుంది. దీన్నే ‘సర్వైకల్ స్పాండిలోసిస్’ అంటారు.

d2

లక్షణాలు ఏమిటంటే :

మెడనొప్పి తీవ్రంగా ఉండి మెడ ఎటువైపు కదిల్చినా నొప్పి తీవ్రవుతుంది.

వెన్నుపూస నుంచి చేతులకు బయలుదేరే నాడులు ఒత్తిడికి గురికావడం వల్ల నొప్పి భుజాల మీదుగా చేతులకు క్యాపిస్తుంది. తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, ఒక్కోసారి తలతిరిగినట్లుగా (వర్టిగో) అనిపిస్తుంది. చేయి పైకిఎత్తడం కష్టమవుతుంది.

జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే :

• సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడేవారు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు
వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి.

• కుర్చీలో కూర్చున్నప్పుడు, వాహనం నడిపేటప్పుడు నిటారుగా ఉండేవిధంగా
సరైన భంగిమలో కూర్చోవాలి

• బరువులు ఎక్కువగా లేపకూడదు

• పడుకునేటప్పుడు తలకింద ఎత్తై దిండ్లు వాడకూడదు

• మెడను ఒకేసారి అకస్మాత్తుగా తిప్పకూడదు

• మెడనొప్పి ఉన్నప్పుడు స్వల్ప వ్యాయామాలు డాక్టర్ సలహా మేరకు చేయాలి

• సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.

హోమియో చికిత్సా విధానం ఏమిటంటే ………

హోమియోపతి వైద్యవిధానంలో సర్వైకల్ స్పాండిలోసిస్‌కి పూర్తి ఉపశమనం కలిగించే ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విధానంలో కేవలం లక్షణాలు తగ్గించడం కాకుండా, లక్షణాలకు కారణాలను, వ్యక్తి శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి తగిన ఔషధాన్ని వైద్యులుసూచిస్తుంటారు.

సాధారణంగా వాడే మందులు…

బ్రయోనియా:మెడ కదిలించడం వల్ల నొప్పి ఎక్కువవుతుంది. విశ్రాంతితో నొప్పి తగ్గుతుంది. వీరికి మలబద్దకంతో పాటు మెడనొప్పి వస్తుంది. దాహం అధికంగా ఉండి నీరు ఎక్కువగా తాగుతారు. ఈ లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకరం.

స్పైజీలియం: నొప్పి మెడ నుంచి మొదలై ఎడమభుజంలో ఎక్కువగా ఉంటే ఈ మందు పనిచేస్తుంది.
కాల్మియా : కుడిభుజం వైపు నొప్పి ఎక్కువగా ఉంటే ఇది ప్రయోజనకారి.

కోనియం:మెడనొప్పితో పాటు కళ్లు తిరిగినట్లనిపిస్తుంది. వృద్ధుల్లో వచ్చే మెడనొప్పికి ఉపయోగం. ఇవేకాకుండా హైపరికం, రాస్టాక్ మొదలైన మందులను వాటి వాటి లక్షణాల ఆధారంగా వైద్యుల సూచనమేరకు వాడితే మెడనొప్పి నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...