మునక్కాయలు మన ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయంటే………..

September 27, 2016

మునక్కాయలు సాంబారులోనే కాదు…కూర వండుకున్నా ఆ రుచి మరి దేనికీ సాటి రాదు.
పోషకాలకు కూడా కొదువ లేదు.
విలువైన ఖనిజాలు, మాంసకృత్తులు, విటమిన్లు అందిస్తుంది మునగ.

munaga

మరి వాటివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో తెలుసుకుందామా.

మునగలో అధికంగా లభించే క్యాల్షియం, ఇనుము.. ఇతర విటమిన్లు ఎముకల్ని దృఢంగా ఉంచుతాయి. పిల్లలు మునగను కూరలా తిన్నా, సూప్‌రూపంలో తాగినా.. ఎముకలు గట్టిగా మారతాయి.

* రక్త శుద్ధికి…
*************
మునగలో ఉండే గింజలూ, ఆకులు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలను కలిగి ఉంటాయి.
మునగ యాంటీబయాటిక్‌ కారకంగానూ పనిచేస్తుంది. తరచూ దీన్ని తీసుకోవడం వల్ల మొటిమలతో పాటు ఇతర చర్మ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
అంతేకాకుండా రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయులూ అదుపులో ఉంటాయి.
ఫలితంగా మధుమేహం సమస్య చాలామటుకూ నియంత్రణలో ఉంటుంది.
గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యల్ని అదుపు చేస్తుంది మునగ.

* గర్భిణులకు మంచిది…
*******************
గర్భం దాల్చినప్పుడు మునగను తీసుకోవడం వల్ల ప్రసవానికి ముందు, తరవాత వచ్చే సమస్యల్ని చాలామటుకూ తగ్గించుకోవచ్చు.మునగ తల్లిపాలు పుష్కలంగా వచ్చేలా చేస్తుంది. ఆకుల్లోనూ, మునగ పూలల్లోనూ యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది విటమిన్‌ సిని కూడా శరీరానికి అందిస్తుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు అదుపులో ఉంటాయి. అంతేనా శరీరానికి హాని చేసే ఫ్రీ రాఢికల్స్‌ ప్రభావం కూడా తగ్గుతుంది. జీర్ణశక్తి పనితీరు మెరుగుపడుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ తగ్గుతాయి

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...