ముఖంపై మచ్చలు తొలగించుకోవడానికి బంగాళా దుంపలను ఎలా వాడాలంటే………

October 13, 2016

బంగాళా దుంపలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చక్కగా దోహదం చేస్తుంది.

బంగాళాదుమపాలను ఎలా ఉపయోగించవచ్చంటే…

ముఖంపై వచ్చే నల్లమచ్చలకు బంగాళాదుంప చక్కటి పరిష్కారం.

potato

బంగాళాదుంప రసాన్ని ముఖానికి రాసుకుని మృదువుగా మర్దన చేసుకోవాలి. అరగంటయ్యాక చల్లటినీళ్లతో కడుక్కోవాలి. కళ్లకింద నల్ల మచ్చలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆలూని గుండ్రంగా కోసి మెత్తని వస్త్రంలో ఉంచి కళ్లపై పెట్టుకోవాలి. ఇలా రాత్రంతా ఉంచుకున్నా ఫర్వాలేదు. నెమ్మదిగా మచ్చలు పోతాయి.

బంగాళాదుంప రసం, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని.. ముఖానికి రాసుకుని మర్దన చేసుకోవాలి. నిమ్మ గుణాలు చర్మంపై సహజ బ్లీచ్‌లా పనిచేస్తాయి. బంగాళాదుంప రసం మురికిని తొలగించేసి చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది.

కొందరికి చిన్న వయసులోనే ముఖం మీద వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. అలాంటి వారు బంగాళాదుంప రసంలో దూదిని ఉంచి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరవాత తీసి ముఖం మీద మెల్లగా రాయాలి. ఇలా చేయడం వల్ల అలసిన చర్మానికి సాంత్వన కలగడంతో పాటూ, ముడతలూ తగ్గుముఖం పడతాయి. నిత్యం ఇలా చేయడం వల్ల బంగాళాదుంపలోని యాంటీ ఏజింగ్‌ గుణాలు చర్మం మీద చక్కగా పనిచేస్తాయి.

ఏదైనా పనిమీద బయటకు వెళ్లడం వల్ల కొందరి చర్మం కమిలిపోయి నల్లగా మారుతుంది.. దీన్ని త్వరగా వదిలించుకునేందుకు బంగాళాదుంప గుజ్జు మంచి ప్రత్యామ్నాయం. బంగాళాదుంపను మిక్సీలో మెత్తగా ముద్ద చేసుకోవాలి. దీంతో, ముఖానికి మర్దన చేసుకుని అలా వదిలేయాలి. పావుగంటయ్యాక చల్లటినీళ్లతో శుభ్రం చేసుకుంటే టాన్‌ తొలగిపోవడమే కాదు చర్మానికీ తేమ అందుతుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...