ముఖంపై నల్ల మచ్చలు పోవాలంటే……………..

September 16, 2016

ముఖంపై ఏర్పడే నల్లమచ్చలు (బ్లాక్ హెడ్స్) చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి.
ఆఫీసుకు వెళ్లే ఉద్యోగినులకైతే ఈ తరహా సమస్యలు వేధిస్తూ , మానసికంగా కృంగదీస్తుంటాయి.
మొటిమలు ఏర్పడ్డాక… ఆ ప్రదేశంలో మచ్చలు ఏర్పడుతుంటాయి. మరి వీటిని ఎలా తొలగించుకునేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు కూడా. ఇలాంటి వారికి అతి తక్కువ ఖర్చులో ఇంటివైద్యంతోనే ఉపశమనం పొందొచ్చు.

black-heads

ఎలాగంటే………..
ముఖంపై ఏర్పడే నల్ల మచ్చలు (బ్లాక్ హెడ్స్)కు దాల్చిన చెక్కలతో ఫుల్‌స్టాఫ్ పెట్టవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దాల్చిన చెక్కను పొడి చేసి దానిలో తేనెను కలపాలి.

ఈ పేస్ట్ ను రాత్రి పడుకునే ముందు నల్లమచ్చలపై రాయాలి. ఉదయాన్నే లేచి శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా మూడు రోజుల పాటు చేస్తే మచ్చలు పూర్తిగా పోతాయి.

ఇదే పేస్ట్‌లో కొద్దిగా నిమ్మరసం, పసుపు కలిపితే ముఖంపై ఉండే మచ్చలు చర్మం రంగులో కలిసిపోతాయని పెరటి వైద్యులు చెపుతున్నారు.

సాధారణంగా శరీరంపై ఏర్పడే గాయాలకు మందుగా పసుపును వాడుతుంటాం. పసుపు బ్లాక్ హెడ్స్‌ను తొలగించడంలో కూడా బాగా పనిచేస్తుంది.

పసుపును రెండు స్పూన్ల పుదీనా రసంలో కలిపి పేస్ట్ లా చేసుకొని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాయాలి. పేస్ట్ ఆరిపోయిన తరువాత వేడినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా మూడు రోజులు చేస్తే మచ్చలు పోతాయి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...