మీ బరువును బట్టి నీళ్ళను త్రాగితే ………… ఆ నీళ్ళే అమృతమవుతాయి…….

November 2, 2016

మనం ఇప్పుడు నీటిని త్రాగుతున్న విధానం సరైనదేనా అని ప్రశ్నించుకుంటే …….
ఎవరి నుండైనా …..అవునేమో , లేదేమో…… అనే జవాబే వస్తుంది కానీ
ఖచ్చితంగా సరైన రీతిలోనే నీటిని త్రాగుతున్నామని ఎవరూ చెప్పలేరు.

ఎందుకంటే నీటిని త్రాగే సరైన పధ్ధతి ఎవరికీ తెలియదు కాబట్టి.

water

మన ఆయుర్వేదం నీటిని ఎలా త్రాగాలని చెప్పిందంటే………….

నేటికి కొన్ని వేల సంవత్సరాల క్రితం వాగ్భటుడనే ఆయుర్వేద శాస్త్రవేత్త ఈ విషయాన్ని
చాలా వివరంగా చెప్పాడు.

రాత్రిపూట ఒక రాగి చెంబులో నీళ్ళు పోసి మూత పెట్టి ఉంచుకోవాలి.

ఉదయాన్నే నిద్ర లేవడం తోనే ఆ లీటరు నీళ్ళు త్రాగాలి.
ఈవిషయం అందరూ చెబుతారు కానీ ఇక్కడ ఒక్క నియమం పాటించాలి.

ఎప్పుడూ ఒక్క విషయం గుర్తుంచుకోండి.
నీళ్ళు ఎప్పుడూ కూర్చునే త్రాగాలి, పాలు, టీ, కాఫీ ఎప్పుడూ నిలబడే త్రాగాలి.
అంతేకాదు నీళ్ళు గడ గడా త్రాగకూడదు. క్రిందకూర్చుని కొంచెం కొంచెంగా టీ త్రాగినట్టు త్రాగాలి.

అంతేకానీ నీళ్ళు ఒక్కసారిగా గ్లాసు ఎత్తి పట్టుకుని గడ గడా త్రాగకూడదు.
ఇదీ నీళ్ళు త్రాగే విషయంలో పాటించాల్సిన ఖచ్చితమైన విషయం.

మరోవిషయం, నీళ్ళు ఎన్నిత్రాగాలి…

అందరూ ఏం చెబుతున్నారంటే, రోజూ ఖచ్చితంగా 5 లీటర్ల నీరు త్రాగాలి అని .
ఇది చాలా అసంబద్దమైన విషయం.

మన బరువును 10తో భాగించి దానిలో నుండి రెండు తీసివేస్తే ఎంత అంకె వస్తుందో అన్ని లీటర్లు త్రాగాలి.

ఉదాహరణకు మీరు 60 కిలోలు ఉన్నారనుకుంటే, 60 ని 10 తో భాగిస్తే 6, దీనిలో 2 తీసివేస్తే 4. అంటే నాలుగు లీటర్ల నీరు రోజూ త్రాగాలి.

మరో విషయం ఆహారం తీసుకునే ఒక గంట ముందు లేదా ఒక గంట తరువాత మాత్రమే నీరు త్రాగాలి.

“భోజనాంతే విషం వారి”. అనేది సూత్రం.

అంటే భోజనం తరువాత నీరు త్రాగండం విషంతో సమానం అని.

కొద్దిగా గొంతు తడుపుకోవడానికి, తిన్నతరువాత రెండు లేదా మూడు గుటకల నీరు త్రాగవచ్చు.

నీటి విషయంలో ఈ నియమాన్ని పాటిస్తే మలబద్దకం, గ్యాస్ మొదలైన ఉదర సంబంధరోగాలకు దూరంగా ఉండవచ్చు.

మంచినీళ్ళకు మట్టి కుండలు వాడండి.
త్రాగడానికి రాగి చెంబులు వాడండి.

1 Comment

on మీ బరువును బట్టి నీళ్ళను త్రాగితే ………… ఆ నీళ్ళే అమృతమవుతాయి……..
  1. Bhoopathi kichi
    |

    మంచీ సుఁతలూ

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...