మీ పిల్లలు స్కూల్ కు వెళుతున్నారా …… అయితే వారిని ఇలా కాపాడుకోండి

October 31, 2016

స్కూల్ లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులందరికీ ఉపయోగపడే విషయం.

ఇది డిల్లీ లోని ఒక స్కూల్ లో జరిగిన సంఘటన.

ఎనిమిది సంవత్సరాల ఒక అమ్మాయిని సాయంత్రం వేళ స్కూల్ వదిలిపెట్టగానే,
ప్రతిరోజూ ఆ అమ్మాయి తల్లి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళేది.

girls

కానీ ఒకరోజు ట్రాఫిక్ వల్ల ఆమె ఇంటి దగ్గర నుండి స్కూల్ వద్దకు రావడం ఆలస్యమైంది.

ఆ అమ్మాయి తన తల్లి కోసం స్కూల్ గేట్ బయట వేచి చూస్తూ ఉంది.

దీనిని ఆసరాగా తీసుకొన్న ఒక వ్యక్తి ,
ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి “ మీ అమ్మకు వేరే అర్జంట్ వర్క్ ఉండటం వల్ల ఇప్పుడు స్కూల్ దగ్గరకు రాలేకపోయింది, అందుకే నిన్ను తీసుకురమ్మని నన్ను పంపించింది “ అని ఆ అమ్మాయితో చెప్పాడు.

వెంటనే ఆ అమ్మాయి , “ సరే మా అమ్మ నన్ను తీసుకురమ్మని…… నిన్ను పంపించినట్లయితే
మా అమ్మ నీకు చెప్పిన పాస్ వర్డ్ చెప్పు “ అని అడిగింది.

వాడికేమీ అర్థం కాలేదు. అటూ ఇటూ చూసి తడబడ్డాడు.

ఆ అమ్మాయికి వాడి దుర్మార్గపు బుద్ధి అర్థమై ,
గట్టిగా అరిచేలోపుగా వాడు అక్కడి నుండి తప్పించుకున్నాడు.

ఈ మధ్యకాలంలో మాయమాటలు చెప్పి స్కూల్ పిల్లల కిడ్నాప్ లు ఎక్కువగా జరుగుతుండటంతో,
ఆ అమ్మాయి తల్లి , తన కూతురికి ఒక పాస్ వర్డ్ ను చెప్పింది.

స్కూల్ వద్దకు తాను కాకుండా ఎవరైనా వచ్చి రమ్మని పిలిస్తే…………
వాళ్ళను ఆ పాస్ వర్డ్ ను అడగమని చెప్పింది.

అప్పుడు ఆ పాస్ వర్డ్ వాళ్ళు చెప్పలేకపోతే కిడ్నాపర్ అని కనిపెట్టి గట్టిగా అరవమని చెప్పింది.

తన తల్లి చెప్పిన ఈ ఉపాయం వల్ల ఆ అమ్మాయి కిడ్నాపర్ ల బారి నుండి తప్పించుకోగలిగింది.

తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఈ పాస్ వర్డ్ విధానాన్ని పాటిస్తే ………..
చాలా వరకు కిడ్నాపర్ల బారి నుండి తమ పిల్లలను రక్షించుకోవచ్చు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...