మహిళలూ జాగ్రత్త …… ఈ కొత్త తరహా మోసాన్ని అందరికీ తెలియజేయండి

September 26, 2016

మహిళలూ జాగ్రత్త…………

నమ్మించి మోసం చేసి ఉన్నదంతా దోచుకువెళ్ళే గ్యాంగులు …….

రకరకాల ఎత్తుగడలతో ప్రజలను వంచిస్తున్నారు. ఒక్కసారి దీన్ని చదవండి.

untitled-train-1

ఎవరైనా మహిళ మీ ఇంటి వద్దకు వచ్చి………… ,
గ్యాస్ కంపెనీ నుండి వచ్చామని …………,
మెడలో ఉన్న ఐడీ కార్డు చూపించి…………,
గ్యాస్ స్టవ్ మెయిన్ టేనేన్సు కోసం సంవత్సరానికి రూ. 200 లు కట్టి
మెంబర్ షిప్ కార్డు తీసుకోమని అడిగితే ,
తొందరపడి నమ్మి ఇంట్లోకి రానివ్వకండి.

ఆ గ్యాస్ కంపెనీ యొక్క ఐడీ కార్డులు , మెంబర్ షిప్ కార్డులు అన్నీ కూడా భోగస్ అని గుర్తించండి.

ఎందుకంటే ,
ఏ గ్యాస్ కంపెనీ కూడా అలా వినియోగదారుల ఇళ్ళ వద్దకు తమ ప్రతినిధులను పంపించదని తెలుసుకోండి.

అలాంటి వారిని తొందరపడి ఇంట్లోకి రానిస్తే ,
వారు మాట్లాడుతూ మధ్యలో బాత్ రూమ్ కు అర్జెంట్ అని అడుగుతారు.

అప్పుడు వారిని పంపిస్తే , వారు బాత్ రూమ్ నుండి మీ ఇంట్లో ఎంత మంది ఉన్నదీ ,
మీ ఇంటి పరిస్థితి ని అంతటినీ వాళ్ళ గ్యాంగ్ కు మొబైల్ లో సమాచారం చేరవేస్తారు.
తర్వాత ఆ గ్యాంగ్ వచ్చి ఇంట్లో ఉన్నదంతా దోచుకొని వెళతారు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ గా చేసుకొని ,
క్లోరో ఫాం వాడి , ఆ గ్యాంగ్ లు ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నాయి.

అలాంటి వారి పట్ల ఎలాంటి అనుమానం కలిగినా పోలీసులకు ఫిర్యాదు చేయండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...