మహాత్మాగాంధీ మనవడు కానూగాంధీ కన్నుమూత

November 8, 2016

మహాత్మాగాంధీ మనవడు కానూగాంధీ కన్నుమూత
*************************************
ఉప్పు సత్యాగ్రహంలో దండి బీచ్‌లో
ఓ పదేళ్ల పిల్లాడు గాంధీజీ చేతికర్ర పట్టుకుని నడిపిస్తున్న చిత్రం దేశ విదేశాల్లోనూ చాలా ప్రత్యేకం.

చిత్రంలోని అప్పటి ఆ పిల్లాడి పేరు ‘కానూ రాందాస్ గాంధీ’ (ఇప్పుడు 96 ఏళ్లు).
మహాత్ముడి మనవడు. గాంధీకి అత్యంత సన్నిహితులు, దండి సత్యాగ్రహానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉండి బతికున్న అతికొద్ది (వేళ్లమీద లెక్కపెట్టగలిగేవారు) మందిలో కానూ గాంధీ ఒకరు.

ig

అలాంటి ఆయన ఇక లేరు. దుర్భర స్థితిలో ఈ లోకాన్ని వీడారు.

మహాత్మాగాంధీ మనవడు కానూ రాందాస్ గాంధీ(96) తుదిశ్వాస విడిచారు.

గాంధీ మనవడిగా కంటే ఆయన సన్నిహితుడిగానే అందరికీ పరిచయమున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు వారాలుగా సూరత్‌లోని రాధాకృష్ణన్ ఆలయం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

నాసాశాస్త్రవేత్తగా, అమెరికా రక్షణ శాఖ ఉద్యోగిగా సేవలందించిన ఆయన
మెడికల్ రీసెర్చర్ అయిన శివలక్ష్మి(90)ని వివాహం చేసుకున్నారు.

ఉప్పు సత్యాగ్రహానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఆయనకు భార్య తప్ప నా అన్న వారు ఎవరూ లేరు.

40 ఏళ్లపాటు అమెరికాలో ఉన్న కానూ దంపతులు రెండేళ్ల క్రితం భారత్‌కు తిరిగి వచ్చారు.

వీరికి సంతానం లేదు. ఉద్యోగం ద్వారా సంపాదించినది
దానధర్మాలకు ఖర్చు చేయడంతో చేతిలో చిల్లిగవ్వలేని దీనస్థితికి చేరుకున్నారు.

ఈక్రమంలో అనారోగ్యం పాలైన ఆయన ఆలయ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అక్టోబరు 22న వచ్చిన గుండె పోటు కారణంగా కానూ పక్షవాతానికి గురయ్యారు.

ఫలితంగా ఎడమవైపు శరీర భాగం చచ్చుబడిపోయింది.
వెంటిలేటర్‌పై ఉన్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో కన్నుమూశారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...