మనం త్రాగే నీటితో ఎన్ని జబ్బులు నయమవుతాయో తెలుసుకుంటే …. అందరూ ఆశ్చర్యపోతారు

September 21, 2016

రోగాల నివారణలో నీరు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

వాతావరణంలోని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ల కలయిక వల్ల నీరు ఏర్పడు తుంది. ఈ రెండు వాయు పదార్ధాలు కలిస్తే ద్రవ రూపమైన నీరు ఏర్పడును. నిత్యజీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తాం. నీటిని ఉపయోగించి అనేక వ్యాధులను తగ్గించే అవకాశం ఉంది. అవి ఏమిటంటే…………..

గొంతునొప్పి, టాన్సిల్స్‌ : నీరు వేడిచేయాలి. దానిలో కొద్దిగా ఉప్పు వేసి కరిగించాలి. ఆ నీటిని పుక్కిట పట్టాలి. ఉపశమనం కలుగుతుంది.

జలుబు, ఆస్త్మా, బ్రాంకైటిస్‌ : నీటిని మరి గించాలి. దానిలో కొద్దిగా పసుపు లేక యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండుచుక్కలు వేయాలి. ఆ నీటిఆవిరిపడితే మంచి రిలీఫ్‌.

తలనొప్పి : ఐస్‌ ముక్కలు నుదుటిపై రుద్దాలి.

జ్వరం : తడిగుడ్డతో/ మంచు ముక్కలతో శరీరం ముఖ్యంగా పాదాలు, ఆరిచేతులు తుడవాలి. దీనివల్ల 1-2 డిగ్రీల జ్వరం తగ్గుతుంది.

water

ఎక్కిళ్ళు : గోరువెచ్చని గ్లాసుడు నీరు నెమ్మదిగా సిప్‌ చేస్తూ త్రాగాలి.

కుక్క కరిస్తే : సబ్బునీటితో ఆ భాగం కడిగి శుభ్రం చేయాలి. గాయాన్ని కడగాలి. ఏకధారగా గాయం మీద నీరు పోస్తే రేబీస్‌ కల్గించే సూక్ష్మజీవులు, చొంగపోతాయి. తిరిగి సబ్బు నీటితో కడిగి కట్టుకట్టాలి.

చర్మం కాలితే : వెంటనే చల్లటి నీటితో కాలిన ప్రదేశం తడపాలి. దీనివల్ల కాలిన గాయం చల్లబడి మరింతగా చర్మం కాలి పోకుండా ఉంటుంది.

దగ్గు : వేడినీరు త్రాగితే కఫం కరుగు తుంది. పసుపును మరిగే నీటిలో వేసి ఆవిరి పట్టాలి.

చిన్న చిన్న గాయాలు : చల్లటి నీటిలో కడిగితే మలినాలు, సూక్ష్మజీవులు పోతాయి. రక్తం నెమ్మదిగా గడ్డకట్టి రక్తం కారడం తగ్గుతుంది.

నిద్రపట్టకపోతుంటే : చల్లటి/ గోరువెచ్చటి నీటితో స్నానం చెయ్యాలి. పాదాలు వేడినీటి తో తడుపుకోవడం మంచిది.

ఒళ్ళు నొప్పులు : వేడినీటిలో ఉప్పువేసి కాపడం కాయాలి.

మలబద్దకం : ఎక్కువగా నీరు త్రాగాలి. రాత్రి రాగి చెంబులో నీరుపోయాలి. అది పరగడుపున త్రాగాలి. దీనివల్ల మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగును.

వాపులవల్ల కలిగే నొప్పి : ఐస్‌ ముక్కతో బాగా రుద్దాలి.

ముక్కులోంచి రక్తం పడుతుంటే : చల్లటి నీరు తలమీద పోయాలి. నుదుట/ ముక్కుమీద తడిగుడ్డ వెయ్యాలి.

దంతాల నొప్పి : గోరువెచ్చని నీటిలొ ఉప్పువేసి పుక్కిలించాలి.

శరీరంలోనొప్పులు : వేడినీటి కాపడం, వేడినీటి ఆవిరి.

రుమాటిజం : ఎక్కువనీరు త్రాగితే రక్తం పలచబడుతుంది. యూరిక్‌ యాసిడ్‌ లెవెల్‌ తగ్గుతుంది. యూరిన్‌ ద్వారా యూరిక్‌ ఆమ్లం బయటికిపోతుంది.

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ : ఎక్కువనీరు త్రాగితే ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సూక్ష్మజీవులు వేగంగా, మూత్రం ద్వారా ఎక్కువగా విసర్జింపబడి ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది.

కంటిలో నలక పడితే : నలపకూడదు. గ్లాసు నిండా నీరు తీసుకోవాలి. దానిలో కన్ను ముంచి చికిలించాలి. కంటిలోని దుమ్ము, ధూళి, నలకలు వంటివి నీటిలోకి వచ్చి బయటికి పోతాయి.

విరోచనాలు, వాంతులు : శరీరంలో నుండి ఎంతనీరు బయటికిపోతుందో అంతే పరిమాణంలో నీరు త్రాగితే నిర్జలీకరణం అరికట్టబడుతుంది.

రసాయనాలు చర్మంపై పడితే : ఎక్కువసేపు, ఏకధారగా నీరుపోస్తూ కడగాలి. తీవ్రత తగ్గుతుంది.

మూత్ర పిండాలలో రాళ్ళు : ఎక్కువగా నీరు త్రాగాలి. చిన్న రాళ్ళు మూత్రం ద్వారా విసర్జింపబడతాయి. మూత్రం పలచబడడం వల్ల యూరిన్‌ యాసిక్‌ రాళ్ళు ఏర్పడవు. మూత్రకేశ సంబంధ వ్యాధులు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంది.

ఎక్కువగా నడవడంవల్ల కలిగే కాళ్ళనొప్పులు : గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలపాలి. కొద్దిసేపు ఆ నీటిలో పాదాలు ఉంచాలి.

కడుపునొప్పి : హాట్‌వాటర్‌ బేగ్‌ ఆ ప్రదేశంలో ఉంచాలి.

జ్వరం : గంటకు కనీసం ఒక గ్లాసు నీరు త్రాగడం మంచిది. శరీరం నుండి బయటికిపోయే నీరు భర్తీ అవుతుంది. నీరు ఆవిరి అవడంవల్ల చర్మం చల్లబడు తుంది. మలినాలు ఎక్కువగా విసర్జింప బడతాయి. ఇన్‌ఫెక్షన్‌ త్వరగా తగ్గుతాయి.

శరీరంలో ఏ అవయవమైనా వాపు, నొప్పి : ఐస్‌ముక్కలతో రాయాలి.

ఒంటికి నీరు పడితే : పెరుగు ఎక్కువగా వాడాలి. ఇది కఫాన్ని కరిగిస్తుంది కూడా.

ముక్కులో, గొంతులో శ్లేషం : దోసిట్లో నీరు పోసుకొని ముక్కుతో లోనికి లాగడం.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...