మజ్జిగలో చద్దన్నం కలిపి తింటే ……. ఆరోగ్యమే ఆరోగ్యం

November 16, 2016

పూర్వకాలంలోని పెద్దలందరూ , అలాగే ఈకాలంలోని గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు ……
ఉదయాన్నే చద్దన్నం తినడాన్ని మీరు చూసే ఉంటారు. లేదా ఎవరైనా చెబితే వినైనా ఉంటారు.

ఆ చద్దన్నం ఆరోగ్య పరంగా ఎంత మంచిదో ఇప్పుడు చదివి తెలుసుకోండి.

majjigannam

రాత్రి మిగిలిన అన్నంలో మ‌జ్జిగ‌, ఉప్పు క‌లిపి కుండలో పెడితే
ఉద‌యం అయ్యే స‌రికి ఆ అన్నం పులిసి మంచి పోష‌కాల‌తో రెడీ అవుతుంది.

లేదంటే రాత్రి పూట అన్నం వండి అందులో కొన్ని పాలు పోసి, తోడుకోవ‌డం కోసం ఓ మ‌జ్జిగ చుక్క‌ను వేసినా ఉద‌యం లేచే సరికి మ‌జ్జిగ‌, చ‌ద్ద‌న్నం త‌యారుగా ఉంటుంది. దీన్ని ప‌చ్చ‌డితోనో, ఉల్లిపాయ‌, మిర‌ప‌కాయ‌ల‌తోనో మ‌న‌వాళ్లు ఉద‌యాన్నే తినేవారు.

దీంతో వారు రోజంతా ఎంతో ఉత్తేజంగా, శ‌క్తితో ఉండేవారు. అలా వారు అప్ప‌టికీ, ఇప్ప‌టికీ అదే శ‌క్తితో ముందుకు సాగుతున్నారు. కానీ మ‌న‌మే దాన్ని పూర్తిగా ప‌ట్టించుకోలేదు.

అయితే అమెరిక‌న్ డైటెటిక్ అసోసియేష‌న్ వారు చేసిన ప‌రిశోధ‌న ప్ర‌కారం…

సాధార‌ణ అన్నం క‌న్నా పైన చెప్పిన విధంగా త‌యారైన చ‌ద్ద‌న్నంలో ఐర‌న్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు దాదాపుగా 20 రెట్లు ఎక్కువ‌గా ఉంటాయ‌ని తెలిసింది.

అందుకే అప్ప‌ట్లో మ‌న పెద్ద‌ల‌కు అంత శ‌క్తి ఉండేది.
ఇప్ప‌టికీ వారు ఆరోగ్యంగానే ఉండ‌గలుగుతున్నారంటే అదే కార‌ణం.

అమెరిక‌న్ డైటెటిక్ అసోసియేష‌న్ వారు చ‌ద్ద‌న్నం, మ‌జ్జిగ గురించి ఇంకా ఏం చెబుతున్నారంటే…

• చ‌ద్ద‌న్నం, మ‌జ్జిగ కాంబినేష‌న్‌లో ఉద‌యాన్నే తిన‌డం వ‌ల్ల రోజంతా శ‌రీరం ఉత్తేజంగా ఉంటుంది.

• శ‌రీరానికి మంచి చేసే బాక్టీరియా వృద్ధి చెందుతుంది.

• వేడి చేసిన వారు ఉద‌యాన్నే ఈ ఆహారం తిన‌డం వ‌ల్ల ఎంతో చ‌లువ పొందుతారు.

• మ‌ల‌బ‌ద్ద‌కం, నీర‌సం త‌గ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది.

• రోజంతా శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి అందుతుంది.

• అల్స‌ర్లు రాకుండా ఉంటాయి

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...