భారత ఆర్మీ పవరేంటో చూపారు ……. జైహింద్

November 24, 2016

మంగళవారం నాడు పాక్ సైన్యం అండతో ఉగ్రవాదులు రెచ్చిపోయి ఇద్దరు భారత జవాన్లను చంపేశారు.
ఓ సైనికుడి తలను నరికేశారు.

aim
జనీవా ఒప్పందం ప్రకారం శిరచ్ఛేదనం చేయడం నిషేధం.
‘‘సైనికులను శిరచ్ఛేదనం చేసి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌
తగిన ప్రతికారం అనుభవించక తప్పదు’’ అని భారత ఆర్మీ హెచ్చరించిన సంగతి మనందరికీ తెలిసిందే.

aim1

పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామన్న మాటను భారతదేశ సైన్యం నిలబెట్టుకుంది.
మంగళవారం ముగ్గురు భారతీయ సైనికులు అమరులైన నేపథ్యంలో
బుధవారం పాకిస్థాన్ పోస్టులపై భారీ ఎత్తున మోర్టార్లతో దాడులు చేసింది.

aim2

పూంఛ్, రాజౌరీ, కేల్, మచిల్ సెక్టర్లలోని పాకిస్థాన్ స్థావరాలపై విరుచుకుపడింది.
ఈ దాడుల్లో తొమ్మిది మంది పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం.
మృతుల్లో కెప్టెన్ స్థాయి అధికారి ఉన్నట్లు తెలుస్తోంది.

aim4

అయితే పాకిస్థాన్ బుధవారం కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులను కొనసాగించింది.

భారత సైనికులను చంపి శిరచ్ఛేదనం చేస్తూ.. పైశాచికానందం పొందుతున్న పాకిస్తాన్ సేనలకు భారత ఆర్మీ గట్టి సమాధాన మిస్తోంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...