భగత్ సింగ్ ఉరిశిక్ష ఖరారుకు కారణమైన వ్యక్తికి ఎంతటి గౌరవం దక్కిందంటే…..

September 30, 2016

విప్లవ వీరుడు భగత్ సింగ్ ను బ్రిటీష్ వారు ఉరి తీసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే.

కానీ భగత్ సింగ్ కు ఉరి శిక్ష ఖరారు చేయడానికి
ఒక భారతీయుడు ఇచ్చిన సాక్ష్యమే కారణమనే సంగతి మీకు తెలుసా………….?

అవును…………మీరు చదువుతున్నది అక్షరాలా నిజం.

shobha-singh

అసెంబ్లీ పై బాంబు దాడి కేసు విషయంగా భగత్ సింగ్ పై కోర్టులో కేసు నడుస్తుండగా,
శోభా సింగ్ అనే ఒక భారతీయ వ్యాపారి సాక్ష్యం చెప్పాడు.

భగత్ సింగ్ అసెంబ్లీ లో బాంబులు విసరడాన్ని తాను కళ్ళారా చూశానని శోభా సింగ్ చెప్పడంతో ,
కోర్టు భగత్ సింగ్ కు ఉరిశిక్షను విధించింది.

భగత్ సింగ్ ఉరి శిక్ష తర్వాత ఆయన మరణానికి కారకుడైన శోభా సింగ్ కు బ్రిటీష్ ప్రభుత్వం మరియు
మన భారత పాలకులు ఎంతగా గౌరవించి లబ్ది చేకూర్చారో తెలిస్తే అందరూ ఆశ్చర్య పోతారు.

బ్రిటీష్ ప్రభుత్వం శోభా సింగ్ కు “ సర్ “ బిరుదునిచ్చి గౌరవించింది.

డిల్లీ మహా నగరంలో ప్రముఖ బిల్డింగులన్నీ కట్టే కాంట్రాక్టును శోభా సింగ్ కే కేటాయించారు.

ఆ తర్వాత వచ్చిన మన పాలకులు,
శోభా సింగ్ పేరును ఆయన జ్ఞాపకార్థమని చెప్పి ఒక ప్రాంతానికి నామకరణం చేసారు.

అంతేగాక శోభా సింగ్ పేరు మీద ఏకంగా ఒక పోస్టల్ స్టాంప్ నే విడుదల చేశారు.

ఆయనకు దేశంలోని ప్రముఖ అవార్డులనిచ్చి సత్కరించారు.

ఎందుకు శోభా సింగ్ ను అంతగా గౌరవించారని ఎవరైనా మన పాలకులను ప్రశ్నిస్తే…….,
ఆయన దేశ రాజధాని డిల్లీలో ఎన్నో గొప్ప భవనాలను కట్టించిన పెద్ద బిల్డర్,
రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి అంతటి ప్రాధాన్యతను ఇచ్చామని చెప్పారు.

కానీ మనదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఒక వీరుడు భగత్ సింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి,
ఆయన మరణానికి కారణమయింది ఈ శోభా సింగ్ అనే విషయం తెలిసి కూడా,
మన భారత పాలకులు ప్రవర్తించిన విధానం తలుచుకుంటే………..
ప్రతి భారతీయుడి మనసుకీ ఎంతో బాధ , ఆవేశం కలుగుతాయి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...