బ్లడ్ క్యాన్సర్ తో బాధపడే 14 ఏళ్ళ లోపు చిన్నారులకు ప్రాణాలు పోస్తున్న ఆసుపత్రి

November 23, 2016

బ్లడ్ క్యాన్సర్ – ఈ పేరు వింటే చాలు , ప్రతి ఒక్కరి గుండె జల్లుమంటుంది.

ఎందుకంటే ఇది ప్రాణాంతకమైన అతి భయంకరమైన వ్యాధి.
ఈ వ్యాధి వచ్చిన రోగి రోజురోజుకూ మరణానికి దగ్గరవుతూ వస్తాడు.
ఇక చిన్న పిల్లల్లో వస్తే , ఆ తల్లిదండ్రుల బాధను మాటల్లో వర్ణించలేము.

jaipur-ch

అలాంటి బ్లడ్ క్యాన్సర్ సోకిన 14 సంవత్సరాల లోపు చిన్నారులకు
మంచి వైద్యంతో ప్రాణాలు నిలుపుతోన్న ఆసుపత్రి మనదేశంలోనే ఉంది.

Bhagwan Mahaveer Cancer Hospital and Research Centre (BMCHRC)
అని పిలవబడే ఈ ఆసుపత్రి జైపూర్ లో ఉంది.

mahavir-cancer-hospital-jaipur

ఆసుపత్రి డైరెక్టర్ అయిన డాక్టర్ శ్రీ గోపాల్ కబ్రా చెప్పిన దాని ప్రకారం ,
ఆగష్ట్ 2014 నుండి సెప్టెంబర్ 30, 2015 వరకు మొత్తం 38 మంది బ్లడ్ క్యాన్సర్ పిల్లలకు
ఫ్రీ ట్రీట్ మెంట్ ఇస్తే , అందులో 21 మంది చిన్నారులు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.
మిగిలిన వారికి ఇంకా ట్రీట్ మెంట్ జరుగుతోంది.

నిరుపేదలకు ప్రత్యేక స్కీముల ద్వారా ఇక్కడ ఉచిత ట్రీట్ మెంట్ జరుగుతుంది.

Address:

Jawahar Lal Nehru Marg,
Jaipur,
Rajasthan – 302017

Phone:0141 270 0107

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...