బ్రెయిన్ స్ట్రోక్ ( పక్షవాతం ) ముందుగానే గుర్తించకపోతే ఎంత ప్రమాదమంటే……..

October 13, 2016

అకస్మాత్తుగా ఉన్నట్లుండి మాట తడబడుతుంది. ఒక కాలూ, ఒకచేయీ పడిపోతుంది .
మూతి వంకర పోతుంది. ఎవరో బలవంతంగా వంచేసినట్లు శరీరంలో ఒక భాగం మెలిబడిపోతుంది.
ఇవన్నీ పక్షవాతానికి సంబంధించిన లక్షణాలే.

రక్తనాళాల్లో ఎక్కడో కాస్తంత కొలెస్ట్రాలో, కొవ్వో అడ్డుపడిన ఫలితమిది.
పక్షవాతానికి గురెన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తే ఆ అడ్డంకిని ఒక పరికరం ద్వారా తొలగించే వీలుంది. ఇది పక్షవాతానికి గురెన వ్యక్తిని నిమిషాల్లోనే తిరిగి సాధారణ స్థితికి చేరుస్తుంది.

brain-stroke

మెదడు పరిధిలోని రక్త నాళంలో ఎక్కడెనా అడ్డంకి ఏర్పడితే అది పక్షవాతానికి (హెమీ పెరేసిస్‌) దారి తీస్తుంది. ఒక కాలు, ఒక చేయి పడిపోవడం, మూతి వంకర పోవడంతో పాటు చాలా సార్లు మాట కూడా పడిపోతుంది. అయితే కేవలం రక్తనాళంలో అడ్డంకి ఏర్పడం ఒక్కటే కాకుండా రక్తనాళాల్లో ఒక్కోసారి ఒరిపిడి కారణంగా మెదడులో రక్తస్రావం కావడం వల్ల కూడా పక్షవాతం రావచ్చు.

హృద్రోగుల్లోనే ఎక్కువ:

పక్షవాతం రావడం అన్నది హృద్రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హృద్రోగుల్లో గుండె రక్తనాళాల్లో ఉండిపోయిన కొలెస్ట్రాల్‌ లేదా కొవ్వు ఒక్కోసారి రక్తనాళం ద్వారా మెదడులోకి చేరుతుందింది. ఇది పక్షవాతానికి దారి తీస్తుంది. పక్షవాతం రావడానికి ముందు కొందరిలో అతి స్వల్పమెన కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మాట తడబడటం, రాస్తున్నప్పుడు చేతి కదలికల్లో ఏదో ఇబ్బంది ఏర్పడటంలాంటివి జరుగుతాయి.

అయితే ఆ తరువాత ఓ రెండు గంటల్లో అతడు మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటాడు. అప్పటికి అలా పరిస్థితి చక్కబడగానే సంతోషించి ఊరుకుంటే ప్రమాదమే. నిజానికి మునుముందు ఒక తీవ్రమెన పక్షవాతం రాబోందని చెప్పే హెచ్చరికే అది. దీన్నే (టిఐఎ)ట్రాన్సియెంట్‌ ఇస్కీమిక్‌ అటాక్‌ అంటారు. అసలు ఆ లక్షణాలు కనిపించిన వెంటనే పూర్తి స్థాయి వెద్య చికిత్సలు తీసుకుంటే మునుముందు తీవ్రస్థాయి పక్షవాతం ఏదీ రాకుండానే చూసుకోవచ్చు.’

ముందుగానే సూచన:

అందుకే అసహజమైన లక్షణాలేవెనా కనిపించినప్పుడు వెంటనే న్యూరో ఫిజిషియన్‌ను సంప్రదిస్తే యాంజియోగ్రాఫీ ద్వారా సమస్యను కనుగొంటారు. ఆ వ్యక్తికి గుండె సంబంధమెన సమస్యలేవెనా ఉన్నాయేమో కూడా పరీక్షిస్తారు. మెదడుకు వెళ్లే ప్రధాన రక్తనాళంలో ఎక్కడెనా అవరోధం ఏర్పడుతోందా అన్న విషయాన్ని కూడా చూస్తారు.

మూడు లేక నాలుగు గంటల్లోగా ఆసుపత్రిలో చేర్చాలి:

సాధారణంగా వయసు పైబడటం, పొగతాగడం, అధిక కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు స్థూలకాయం వంటి సమస్యలేవెనా ఉంటే ఇవి కూడా రక్తనాళాల పరిధిని తగ్గిస్తూ వెళతాయి. క్రమంగా ఇవి రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటానికి దారి తీస్తాయి. ఈ కారణాలతో వచ్చే పక్షవాతం (స్ట్రోక్‌ ) గానీ మెదడులో రక్తసవ్రం (హెమరేజ్‌)గానీ తలెత్తినప్పుడు మూడు లేదా నాలుగు గంటల లోపే ఆసుపత్రికి చేర్చగలిగితే వెంటనే యాంజియోగ్రాఫీ చేసి ఏ రక్తనాళంలో ఎక్కడ అడ్డంకి ఏర్పడిందో తెలుసుకుంటాం.

ఆ తరువాత క్లాట్‌ రిటక్ష్రన్‌ సిస్టమ్‌ ద్వారా ఆ అడ్డంకిని బయటికి లాగేసే ఏర్పాట్లు చేస్తాం. అందుకు అతి సూక్ష్మమెన ఒక పరికరాన్ని (కాథెడ్రాల్‌) రక్తనాళంలోంచి అడ్డంకి ఉన్న చోటికి పంపి దాన్ని బయటికి లాగేస్తాం. ఇదే కాకుండా టిపిఎ అనే విధానంలో అడ్డంకి తొలగిపోయేలా చేయవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే సహజ రీతిలో రక్తపస్రరణ మొదలవుతుంది. ఫలితంగా అప్పటిదాకా కనిపించిన పక్షవాత లక్షణాలన్నీ క్షణాల్లో కనుమరుగెపోతాయి. ఒకప్పటి పక్షవాత చికిత్సా విధానాలతో పోలిస్తే ఇది ఎంతో పెద్దముందడుగు.

సమయమే ముఖ్యం:

ఈ తరహా చికిత్సల్లో రోగిని ఎంత తొందరగా ఆసుపత్రికి తీసుకువస్తారన్నది చాలా ముఖ్యం. నాలుగు గంటల లోగా తీసుకువస్తే అది చాలా ఉత్తమం. అలా వీలుకాని పరిస్థితుల్లో కనీసం ఆరు లేదా ఏడు గంటలలోపైనా రోగిని ఆసుపత్రికి త రలించడం జరగాలి. ఒకవేళ ఆ వ్యవధి కూడా దాటిపోతే రక్తపస్రరణ అందని భాగంలో మెదడు కణాలు చనిపోవడం మొదలవుతుంది. దెబ్బతిన్న కణాల స్థానంలో కొత్తకణాలు ఉత్పన్నం కావడం కానీ, మెదడు కణాలను మార్చడం కానీ సాథ్యంకాదు… కాబట్టి జరిగే నష్టం శాశ్వతంగా ఉండిపోతుంది.

అందుకే నిర్ణీత వ్యవధిలో రోగిని ఆసుపత్రికి తరలించడం ఒక్కటే మెదడును కాపాడే ఏకైక పరిష్కారం. అలా అయితేనే రోగిని తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావడం సాధ్యమవుతుంది. అయితే కొందరిలో రక్తనాళంలో అడ్డుపడిన పదార్థం మరీ గట్టిగా ఉండి బయటికి లాగడం సాధ్యం కాకపోవచ్చు.

వ్యాధి లక్షణాలు:

పక్షవాతం చాలా రకాలుగా వస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి క్షణాల మీద ఒక వైపు చేయి, కాలూ పడిపోవడం. దీన్ని హెమిప్లిజియా అంటా రు. ఒక వైపు మూతి వంకర కావడం. కళ్లు తిరిగి పడిపోవడం. బ్యాలెన్సు తప్పిపోయి ఆల్కహాల్‌ తాగిన మనిషిలాగా నడవడం. దీన్ని ఆరాక్సియా అంటారు. ఒక వైపు చూపు పడిపోవడం దీన్ని హెమియనోపియా అంటారు. పూర్తి స్పృహలేకుండా పడిపోవడం. దీన్ని మాసివ్‌ స్ట్రోక్‌ అంటారు.

మింగడం కష్టంగా ఉండడం, నీరు తాగేటప్పుడు ముక్కు నుంచి నీరు రావడం, మాటలో మార్పు రావడం. మరికొంత మందిలో పైన చెప్పిన పక్షవాత లక్షణాలు ఏవైనా రావచ్చు. కానీ కొన్ని క్షణాలలోగానీ, కొన్ని నిముషాలలో గానీ యథాస్థితికి వస్తారు. దీనిని టి.ఐ.ఎ అంటారు.

నియంత్రణలు:

స్ట్రోక్‌ వచ్చిన తరువాత కంటే రాకముందు తీసుకోవలసిన జాగ్రత్తలే చాలా ముఖ్యం. షుగర్‌ ఉన్నవారు షుగర్‌ను కచ్చితంగా నియంత్రించుకోవాలి. బిపిని కూడా నెలకొకసారి చెకప్‌ చేసుకుంటూ నియంత్రణలో పెట్టుకోవాలి. స్మోకింగ్‌ అలవాటు ఉన్నవారు పూర్తిగా నిలిపివేయాలి.

స్ట్రోక్‌ వచ్చిన తరువాత సి.టి.స్కాన్‌, ఎంఆర్‌ఐ బ్రెయిన్‌, ఎంఆర్‌ యాంజియో, 2డి ఎకో, కెరోటిడ్‌ డాప్లర్‌ పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స చేయించుకోవాలి. రక్తనాళం బ్లాక్‌ అవటం వల్ల వచ్చే స్ట్రోక్‌ అయితే యాంటి ప్లేట్‌లెట్‌ డ్రగ్‌‌స (అంటే రక్తం పలుచబడేందుకు వాడే మందులు) వాడతారు. బిపీ. షుగర్‌ ఉంటేవాటికి తగిన మందులు వాడతారు. పక్షవాతం తీవ్రతను బట్టి పిజియో థెరపీ చేయించుకోవాలి.ఒకసారి స్ట్రోక్‌ వచ్చిన తరువాత మందులు వేసుకుంటూనే జీవనశైలిలో కూడా మార్పులు చేయాలి. నూనె పదార్థాలు తగ్గించాలి. ఆకు కూరలు, కూరగా యలు ఎక్కు వగా తీసు కోవాలి.
ప్రతి రోజూ తగిన వ్యా యామం చేయా లి.

పక్షవాతంలో రకాలు:

మెదడుకు అనేక రక్తనా ళాలు రక్తాన్ని సరఫ రా చేస్తుంటాయి. వాటిని పెద్దవి, మధ్యరకం, చిన్నవి అని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.పెద్ద రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి అవి పూడుకపోతే అప్పుడు తీవ్రమైన పక్షవాతం వస్తంది. అదే మధ్యరకం రక్తనాళాలు బ్లాక్‌ అయితే ఓ మోస్తరు స్ట్రోక్‌ చిన్నవి బ్లాక్‌ అయితే మైనర్‌ స్ట్రోక్‌ వస్తాయి. రెండు అర్థభాగాలను స్పష్ట్టంగా గుర్తించేలా మెదడు నిర్మాణం ఉంటుంది.

ఇందులో కుడివైపున ఉన్న శరీర భాగాలను మెదడు ఎడమ అర్థగోళం నియంత్రిస్తుంది.అలాగే శరీరంలోని ఎడమ అర్ధగోళాన్ని కుడి అర్ధగోళం నియంత్రిస్తుంది. మాటను నియంత్రించే ప్రక్రియ అంతా ఎడమ గోళంలోనే జరుగుతుంది.మెదడు కుడివైపు భాగాలకు రక్త ప్రసరణ జరగకపోతే ఎడమ వైపు, ఎడమ మెదడుకు రక్తపస్రరణ జరగకపోతె కుడివైపు శరీర భాగాలు చచ్చుబడతాయి.

1 Comment

on బ్రెయిన్ స్ట్రోక్ ( పక్షవాతం ) ముందుగానే గుర్తించకపోతే ఎంత ప్రమాదమంటే……...
  1. Janardhanrao
    |

    I am suffering from left spastic hemiplegia capsuler bleed since last 11 years still not cured.Tell me who is most specialised neuro physician in Hyderabad and also tell me what is the best medicine for regular use..

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...