బెండకాయలు తింటే మెదడులో చురుకుదనం పెరుగుతుంది

October 12, 2016

బెండకాయతో మెదడు చాలా చురుకుగా మారుతుంది.
ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో దీని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది.

బెండకాయతో ఆరొగ్యకర ఉపయోగాలు ఏమిటంటే………..

బెండకాయలోని మ్యూకస్‌ వంటి పదార్ధము కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

పీచు, విటమిన్‌ ‘సి’ దీనిలో చాలా ఎక్కువ.

మ్యూకస్‌ పదార్ధం గాస్ట్రిక్‌ సమస్యలను, ఎసిడిటీకి చక్కని పరిష్కారం.
దీనిలోగల డయూరిటిక్‌ లక్షణాల వల్ల యూనరీ ట్రాక్ట్‌ ఇంఫెక్షన్‌ను నయం చేయడంలో సహకరిస్తుంది.

bendakaayalu

బెండకాయ డికాక్షన్‌ తాగితే జ్వరం తగ్గుతుంది.

బెండకాయలు తరచుగా తింటూ ఉంటే మెదడు చురుకుగా తయారవుతుంది.

చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారేక తాగితే టెంపరేచర్‌ తగ్గుతుంది.

చెక్కెర(డయాబిటీస్‌) నియంత్రణలోనూ సుగుణం చూపుతుంది.

బెండకాయ నిలువుగా చీల్చి రెండు సగాల్ని గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి,
మరునాటి ఉదయము ముక్కలు తీసివేసి ఆ నీటిని తాగాలి.
ఇలా రెండు వారాలు పాటు తాగితే సుగర్‌ స్థాయిలు తగ్గుతాయి.
దీనిలో ఉండే పెక్టిన్‌ బ్లడ్‌ కొలెస్టిరాల్‌ను తగ్గించును.

బెండకాయతో కొన్ని రకాల కూరల తయారీని ఇప్పుడు తెలుసుకుందాం

బెండకాయ ఉల్లికారం
**************
కావలసిన పదార్థాలు
పొడవుగా తరిగిన బెండకాయ ముక్కలు : కప్పు, ఉల్లిపాయ ముక్కలు : అర కప్పు, కరివేపాకు : రెండు రెమ్మలు, పసుపు : చిటికెడు, ఉప్పు : తగినంత, నూనె : టేబుల్‌ స్పూన్‌, పోపు కోసం… ఎండుమిర్చి : 4, ఆవాలు : అర టీ స్పూను, మినప్పప్పు : అర టీ స్పూను, శనగపప్పు : అర టీ స్పూను.

తయారుచేయు విదానం :

బాణలిలో చెంచాడు నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. బాగా వేగాక ఎండుమిర్చి కూడా వేసి మరో నిమిషం పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కలు చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు వేసి వేయించాలి. చిటపటలాడాక కరివేపాకు, బెండకాయముక్కలు వేసి రెండు నిముషాలు వేయించి మూతపెట్టి సన్నమంట మీద ఉడికించుకోవాలి. ముక్కలు వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లికారం, తగినంత ఉప్పు వేసి రెండు నిముషాలు వేయించాలి.

బెండకాయ పచ్చడి
*************
కావలసిన పదార్థాలు
బెండ కాయలు : పది, టమాట :ఒకటి, ఉల్లిపాయ : ఒకటి, పచ్చి మిర్చి : పది, చింతపండు : నిమ్మకాయంత, బెల్లము : కొద్దిగా, ఉప్పు : తగినంత, వెల్లుల్లి : నాలుగు రేకలు, నూనె : నాలుగు టేబుల్‌ స్పూన్లు.

తయారుచేయు విదానం :

కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. దానిలో కట్‌ చేసిన బెండకాయలు వేసి పది నిమిషాలు వేయించాలి. పొడిపొడిగా వేగిన తరువాత తీయ్యాలి. ఇప్పుడు దీనిలో టమాటా వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి వేయించాలి. ఇప్పుడు మిక్సిలో మిర్చి, ఉప్పు, ఉల్లి, చింతపండు,వెల్లుల్లి, టమాటా జీలకర్ర వేసి మిక్సి పట్టాలి. తరువాత దీనిలో బెల్లం, వేయించిన బెండ కాయలు వేసి ఒక సారి తిప్పాలి. కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. అంతే బెండకాయ పచ్చడి రెడీ.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...