బియ్యం కడిగిన నీళ్ళను ఇలా వాడితే ……… అందానికి అందం , ఆరోగ్యానికి ఆరోగ్యం

November 27, 2016

మన ఇళ్ళల్లో బియ్యం కడిగిన నీళ్ళను ఏం చేస్తాం.. అని ఎవరైనా అడిగితే ……..
ఏం చేస్తాం..పారబోస్తాం.. అని అంటారు.

ricee

కానీ ఈ నీళ్లను సరిగ్గా ఉపయోగిస్తే అందం మెరుగవుతుంది.
బియ్యం నీళ్లు అందానికే కాకుండా మొక్కలకు కూడా చాలా ఉపయోగం.
ఈ నీళ్లు వాడుకుంటే చక్కటి ప్రయోజనం ఇస్తాయి.
విటమిన్స్ మినరల్స్ మన చర్మానికే కాకుండా జుట్టు పోషణకు కూడా ఉపయోగపడుతుంది.

• బియ్యం కడిగిన నీళ్లు జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట అనంతరం తల స్నానం చేయాలి.
ఇలా చేయడం వల్ల హెయిర్ సిల్కీగా మారుతుంది. వారానికి రెండు సార్లు ఇలా చేయాలి.

• మొటిమలు ఉన్న వారు బియ్యం కడిగిన నీళ్లతో కడగడం వల్ల మంచి మార్పు వస్తుంది.

• రషెస్ ఎక్కువగా ఉంటే తొలుత ఒకసారి బియ్యం నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
అనంతరం 15 నిమిషాల తరువాత మళ్లీ బియ్యపు నీటితో కడుక్కోవాలి.

• కాటన్ బాల్ ని బియ్యం కడిగిన నీళ్లలో ముంచి ముఖానికి అప్లై చేయాలి.
దీనిద్వారా సాఫ్ట్ గా..ప్రెష్ గా తయారవుతుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...