ఫోన్ నీళ్ళల్లో పడిందా…………. కంగారు పడకుండా ఇలా చేయండి

September 24, 2016

వేలాది రూపాయలు పెట్టి ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్మార్ట్ ఫోన్ నీళ్లలో పడితే……..
ఎవరైనాగానీ ఎంతో బాధపడతారు.
ఫోన్ ఇక పని చేయదేమోనని ఎంతో కంగారు పడతారు.

అయితే నీటిలో ఫోన్ పడగానే కంగారు పడకుండా,
ఎటువంటి ఆందోళన చెందకుండా కింద పేర్కొన్న విధంగా చేస్తే
అధిక శాతం వరకు ఎలాంటి రిపేర్ చేయకుండానే ఫోన్ ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

pp

* నీటిలో పడ్డ ఫోన్‌ను తీసిన వెంటనే ఆన్ చేయకూడదు. ఫోన్‌పై ఉండే బటన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నొక్కడం లాంటివి చేయకూడదు.

* ఫోన్‌ను గాలిలోకి అటూ ఇటూ ఊపడం, గాలి తగలాలని విసరడం వంటివి చేయకూడదు.

* లోపల నీరు చేరిందేమోనని నోటితో కూడా గాలిని ఊదకూడదు.
ఇలా చేస్తే నీరు డివైస్‌లోని సున్నితమైన ప్రదేశాల్లోకి వెళ్లి మరింత డ్యామేజ్‌కు గురి చేస్తుంది.

* ఏ పద్ధతిలోనూ ఫోన్‌ను హీట్ చేయకూడదు.

* నీటిలో పడినప్పటికీ ఇంకా ఆన్‌లోనే ఉంటే ఫోన్‌ను వెంటనే ఆఫ్ చేసేయాలి.

* ఫ్లిప్ కవర్/బ్యాక్ కేస్, సిమ్, మెమోరీ కార్డు, బ్యాటరీలను తీయాలి.

* పొడి గుడ్డ లేదా పేపర్ టవల్‌తో ఫోన్ డ్రై అయ్యేంత వరకు తుడవాలి.
ఫోన్‌లో ఇతర ప్రదేశాలకు నీరు వెళ్లకుండా జాగ్రత్తగా పట్టుకుని ఈ పని చేయాలి.

* బయటికి రాని నీటిని వాక్యూమ్ సహాయంతో తీసేయాలి.

* కవర్ చేయబడి ఉన్న సంచిలోని బియ్యంలో ఫోన్‌ను పూర్తిగా కప్పాలి. ద్రవాలను పీల్చుకునే శక్తి బియ్యానికి ఎక్కువగా ఉంది. అందుకే ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది.

* ఒకటి లేదా రెండు రోజుల పాటు ఫోన్‌ను అలాగే ఉంచాలి.
అనంతరం తీసి ఎప్పటిలాగే ఉపయోగించవచ్చు.
అయినప్పటికీ ఫోన్ ఆన్ కాకపోతే ముందు చార్జింగ్ కానివ్వాలి.
తర్వాత కూడా ఆన్ కానట్టయితే బ్యాటరీ మార్చి చూడవచ్చు.

* ఫలితం లేకపోతే చివరిగా సర్వీస్ సెంటర్‌కే తీసుకెళ్లడం మంచిది.

అయితే ఫోన్ ఆన్ అయి ఉపయోగంలోకి వస్తే మాత్రం దాన్ని కొద్ది రోజులు జాగ్రత్తగా పరిశీలించాలి.
అందులోని హార్డ్ వేర్ అంతా పర్‌ ఫెక్ట్ గా పనిచేస్తుందో లేదో చూడాలి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...