ప్రాణత్యాగం చేసిన ఈ వీర జవాను తల్లికి సెల్యూట్

October 25, 2016

జై జై మాతా…… భారత్ మాతా ………….

ఒకరు కాదు , ఇద్దరు కాదు ….. ఎనిమిది మంది ఉగ్రవాదులతో అలుపెరుగని పోరాటం ……
తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆ ఉగ్రవాదులను భారత్ లోకి రాకుండా ఆడ్డుకున్న
వీర జవాను ” గుర్నామ్ సింగ్ ” వీర మరణం…

javan

జమ్మూ కశ్మీర్ లొని కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉగ్రవాదులు భారత్ లొకి చొరబడకుండా వీరోచితంగా కాల్పులు జరిపి BSF జవాను గుర్నామ్ సింగ్ అడ్డుకున్నారు .

దీంతో మరోవైపు నుండి పాకిస్థాన్ స్నైఫర్లు అతన్ని లక్ష్యంగా చేసుకొని ధాడి చేసారు.
ఈ ధాడిలొ అతడు తీవ్రంగా గాయపడ్డారు. తల నుండి దూసుకెళ్లిన బుల్లెట్ తో రక్తం ధారలై కారసాగింది.
అతి తేవ్రంగా గాయపడ్డ అతన్ని హాస్పిటల్లో చేర్చారు…….. అయినా లాభం లేకుండా పోయింది.
మృత్యువుతో పోరాడుతూ ఆయన తుది శ్వాస విడిచారు.

చెట్టంత కొడుకు చనిపోతే ఆ తల్లి కడుపుకోత వర్ణనాతీతం .
కళ్లముందే ఉన్న కొడుకు భౌతిక కాయం … ఆ తల్లి గుండెల నిండా తట్టుకోలేనంత బాధ.

సరిగ్గా అప్పుడే తన కొడుక్కిచ్చిన మాట గుర్తుకువచ్చింది ఆ తల్లికి…. బాధనంతా గుండెల్లో అదిమిపట్టి, కొండంత ధైర్యాన్ని తెచ్చుకొని….నేను వీరమాతను..ఏడవనే ఏడవను అంటూ భారత్ మాతాకీ జై….అని
గట్టిగా నినదించింది.

గురునామ్ సింగ్ మృత దేహాన్ని స్వస్థలానికి తరలించిన తర్వాత….. తన కొడుకు మృతదేహాన్ని చూసిన తర్వాత…తల్లి జస్వంత్ కౌర్…” నేను ఏడవను….అలాగని మా అబ్బాయికి మాట ఇచ్చాను,దేశం కోసం తన ప్రాణాలు త్యాగం చేస్తే కంటతడి పెట్టొద్దని గురునామ్ నాతో ఒకసారి చెప్పాడు, వాడు మేము గర్వపడేలా చేశాడు , భారత్ మాతా కి జై ” అని గట్టిగా చెప్పింది.

భారతమాతకు ముద్దు బిడ్డను అందించిన నీకు ,చెట్టంత బిడ్డను పోగొట్టుకున్నా కూడా
చెక్కు చెదరని నీ మనోధైర్యానికి మా సెల్యూట్ తల్లీ.

నీవు వీర మాతవు. భరత మాతకు వీర పుత్రుడని అందించావు. మన సోదరుడు గుర్నాం సింగ్ ఈ పవిత్ర భారత భూమిలోనే ,మనమధ్యే తిరిగి జన్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… ఈ వీర జవానుకు శ్రద్ధాంజలి…

జైహింద్…
జై జవాన్…
భారత్ మాతాకీ జై…

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...