ప్రళయ కాలంలోనూ చెక్కు చెదరని ఈ ప్రదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే……..

November 27, 2016

వారణాసి ఆ లయకారకుడైన పరమేశ్వరుని ప్రతిష్టితం.
అందుకనే ఎలాంటి ప్రళయాలు ఆ నగరాన్ని నాశనం చేయలేవని శాస్త్రాలుచెబుతున్నాయి.

kasi2

యావత్‌ ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కల్పాంతం తరువాత ప్రళయం ఏర్పడుతుంది.
అయితే వారణాసిని మాత్రం ఆ లయకారుడైన శంభునాధుడు సృష్టించాడు.
అందుకే ప్రళయకాలంలో వారణాసిని తన శూలంపై నిలబెడుతాడని నమ్మకం.

సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది.

గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు యువాన్ చువాంగ్ (Xuanzang) ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు.
ఇది గంగానదీ తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని వ్రాశాడు.

kasi1

పురాణకథనాల ప్రకారం
****************
కాశీ శివస్థాపితమని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు.అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం.

kasi

ఆరంభకాల పూరాతతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు.

పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల ఆవాసమని వివరిస్తున్నాయి.
కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. 8వ శతాబ్దంలో 23వ జైనగురువు మరియు ఆరంభకాల తీర్ధగురువు అయిన పర్ష్వ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...