ప్రపంచమే గర్వించదగ్గ రాజు మహా రాణా ప్రతాప్ సింహ్ పరాక్రమం ఎంత గొప్పదంటే…….

October 26, 2016

శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్
********************
రాజస్థాన్ లోని మేవాడ్ రాజ్యాన్ని పాలించిన రాజపుత్ర రాజు శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్ ,
మనదేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ రాజుగా ప్రసిద్ధిగాంచాడు.

maha-rana-pratap

శ్రీ మహారణా ప్రతాప్ యొక్క శరీర బరువు 110 కిలోలు మరియు అతని ఎత్తు 7’5’’.

ఇరువైపుల దారు ఉన్నటువంటి కత్తి, 80 కిలోల ఈటె తను ఉంచుకునే వాడు.
చేతి కవచం,శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి.
అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి.

ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి.

రాణా ప్రతాప్ సింహ్ దగ్గర చేతక్ అనే ఒక గొప్ప గుర్రం ఉండేది.
చేతక్ ఎంత బలమైనదంటే,
రాణాప్రతాప్ సింహ్ ను తనపైకి ఎక్కించుకొని,
ఎదుట ఏనుగుమీద ఉన్న శత్రు సైనికుణ్ణి అందుకోవటానికి అంత ఎత్తులో గాలిలోకి ఎగిరేది.

భీకర యుద్ధంలో చేతక్ ముందరి ఒక కాలు విరిగి ఉన్నప్పటికీ,
రాణాప్రతాప్ ను రక్షించాలనే ఉద్దేశ్యంతో 26 అడుగుల కందకాన్ని దుమికింది.
ఆ కందకం దాటి రాణాప్రతాప్ ను రక్షించిన చేతక్ ఆ తరువాత చనిపోయింది.

అది ఎక్కడైయతే చనిపోయిందో అక్కడే ఒక చింత చెట్టు పెరిగింది.
అదే ప్రదేశంలో దాని గౌరవార్దం చేతక్ మందిరం కట్టారు.

మహారణా ప్రతాప్ దగ్గర ఒక ఏనుగు కూడా ఉండేది.
దాని పేరు రాంప్రసాద్.అది కూడా చాలా గొప్పది. యుద్ధంలో రాణాప్రతాప్ కు ఎంతగానో తోడ్పడింది.

హల్ది ఘాట్ యుద్దంలో మేవాడ్ భీల్ అనే ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు .ఆదివాసీలు మహారాణాను వారి పుత్రుడిగా భావించేవారు.మహారాణా కూడా వారిపట్ల భేదభావం చూపించేవారు కాదు. ఇప్పటికీ మేవాడ్ రాజచిహ్నం లో ఒకపక్క రాజపూత్ మరొక పక్క భీల్ ఉంటారు.

అదే విధంగా మేవాడ్ రాజ్యం లోని కంసాలి వాళ్ళు వేల సంఖ్యలో వాళ్ళ ఇళ్లను వదిలిపెట్టి ఆయుధాగారానికి వచ్చి,, రాణా కోసం రకరకాల ఆయుధాలు తయారు చేసేవారు.రాజు పట్ల, దేశం పట్ల వారికున్న భక్తి, విశ్వాసం ఎంతో శ్లాఘనీయమైనది.

మహారణా ప్రతాప్ సింహ్ దగ్గర ఉన్న 8000 మంది రాజపుత్రుల వీరులు ,60000 మంది మొఘలులతో యుద్దం చేశారు. ఆ ఆయుద్దంలో 48000 మంది చనిపోయారు. హల్ది ఘాట్ యుద్దం జరిగి 300 సంవత్సరాల అయిన తరువాత కూడా ఇప్పటికీ అక్కడి నేలలో ఆయుధాలు లభిస్తున్నాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుదం దొరికింది.

రకరకాల కుట్రలు కుతంత్రాలతో శత్రువులంతా ఏకమై మేవాడ్ రాజ్యంలోని ప్రాంతాలను ఒకదాని తర్వాత ఒకటి ఆక్రమించుకుంటూ పోయారు.కానీ ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి పేరెన్నికగన్న మహారాణా ప్రతాప్ సింహ్ తాను చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% రాజ్యాన్ని తిరిగి గెల్చుకున్నాడు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...